ఇక‌ దూకుడు పెంచ‌నున్న ఫిలింక్రిటిక్స్

Update: 2021-12-04 03:30 GMT
దాదాపు ఐదు ద‌శాబ్ధాల సుదీర్ఘ చ‌రిత్ర క‌లిగిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష‌న్ యాక్టివిటీస్ ఈ క‌రోనా క్రైసిస్ కాలంలో ఎంతో మేలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే అధ్య‌క్ష కార్య‌ద‌ర్శులు కార్య‌వ‌ర్గం మారింది. నూత‌న కార్య‌వ‌ర్గం చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తోంది. గత కార్యవర్గ కోశాధికారి నుంచి అవ‌స‌ర‌మైన రికార్డ్స్  కొత్త కార్య‌వ‌ర్గానికి అందాయి. ఈ రోజు నుంచి FCA అకౌంట్ యాక్టివేట్ అయింది.  సంతకాలు పెట్టి సహకరించిన పూర్వ అధ్యక్ష కార్యదర్శులకు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ కొత్త కార్య‌వ‌ర్గం ప‌నిని ప్రారంభించింది.

ఇక క్రిటిక్స్ కి ఐ.డి.కార్డులు.. ఇన్సూరెన్స్.. ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాల‌పై దృష్టి సారించాల‌ని నూత‌న అధ్య‌క్షుడు ప్ర‌భు ఆయ‌న కార్య‌వ‌ర్గం భావిస్తోంది. అసోసియేషన్ లో జరిగే ప్రతి ప‌నిని పారదర్శకంగా చేయ‌నున్నామ‌ని కార్య‌ద‌ర్శి వెల్ల‌డించారు.

ఇక ఫండ్ రైజింగ్ విషయంగా ఇండస్ట్రీలో పరిస్థితి ఏ మాత్రం సానుకూలంగా లేదు. అందుకు  ఇండస్ట్రీలో నెలకొన్న అయోమయ స్థితి కరోనా ముఖ్య కారణాలు కాగా రెండు అసోసియేషన్స్ వలన పరిశ్రమలో ఏర్పడిన కన్ఫ్యూజన్ మరో కారణం. అలాగని ప్రయత్నం చేయకుండా ఉండే ప్ర‌స‌క్తే లేదు. అయినా అసోసియేషన్లో ఫండ్ రైజింగ్ ఒక్కటే ప్రధాన ఎజెండా కాదు. సానుకూలతను బట్టి ఫండ్ రైజింగ్ ను.. సంక్షేమ కార్యక్రమాలను  ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామ‌ని నూత‌న కార్య‌వ‌ర్గం వెల్ల‌డించింది.

ప్రతి రెండవ శనివారం ఈ. సి. మీటింగ్ జరగాలని తీర్మానించుకున్న  విధంగా రానున్న సెకండ్ సాటర్ డే 11/4/2021 రోజున ఉదయం 10.30 గంటలకు యథాత‌థంగా ఈసీ మీటింగ్ జ‌ర‌గ‌నుంది. అసోసియేషన్ యాక్టివిటీ ఇకముందు చురుకుగా సాగుతాయ‌ని అధ్య‌క్షుడు ప్ర‌భు.. ప్రధాన కార్య‌ద‌ర్శి రాంబాబు ప్ర‌క‌టించారు. టాలీవుడ్ లో ఫిలింక్రిటిక్స్ (ప‌త్రిక‌లు-మ్యాగ‌జైన్లు వ‌గైరా) అసోసియేష‌న్ స‌హా ఎల‌క్ట్రానిక్ వెబ్ మీడియా (టీవీ వెబ్ సైట్లు) అసోసియేష‌న్ యాక్టివ్ గా ఉన్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News