యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ''ఆర్.ఆర్.ఆర్''. యావత్ సినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 7న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి మేకర్స్ భారీ ఎత్తున ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఇందులో భాగంగా RRR నుంచి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ ను రివీల్ చేయబోతున్నారు. వరల్డ్ సినిమాలో కనీవినీ ఎరుగని కోలాబరేషన్ ని ఈ అక్టోబర్ 29న చూడటానికి సిద్ధంగా ఉండండి అంటూ చిత్ర బృందం ప్రకటించింది. అదే రోజున ఓ బిగ్ అప్డేట్ రానున్నట్లు పేర్కొన్నారు. దాంతో ట్రిపుల్ ఆర్ నుంచి రాబోయే ఆ అప్‌డేట్ ఏంటని అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో యూట్యూబ్ లో మిస్టర్ బీస్ట్ పేరుతో ఉన్న ప్రముఖ అమెరికన్ యూట్యూబర్ జిమ్మీ డొనాల్డ్ సన్ తో రాజమౌళి చేతులు కలిపారని.. ఈ విషయానన్నే రేపు వెల్లడిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
సినిమా ప్రమోషన్ల కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న తరుణంలో.. జీరో కాస్ట్ తో విస్తృత ప్రచారం కల్పించేందుకు సోషల్ మీడియా ఉపయోగపడుతుందనే సంగతి తెలిసిందే. ఇప్పుడు RRR టీమ్ కూడా పాపులర్ యూట్యూబర్ తో టై అప్ అవడం ద్వారా అదే సోషల్ మీడియా ఇంజనీరింగ్ ను వర్తింపజేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ లో 72 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్ లను కలిగి ఉంది. దీని ద్వారా ప్రమోషన్స్ చేస్తే వరల్డ్ వైడ్ ట్రిపుల్ ఆర్ రీచ్ మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.
రాజమౌళి తన సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రమోషన్స్ లో ప్రత్యేకమైన స్ట్రాటజీలతో.. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచనలతో ముందుకు వస్తారనే సంగతి తెలిసిందే. ఇప్పుడు RRR చిత్రాన్ని కూడా మరొక స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాడని అర్థం అవుతోంది. ఇదిలా ఉంటే ప్రముఖ హాలీవుడ్ స్టూడియో వార్నర్ బ్రదర్స్ 'RRR' ఇంగ్లీష్ వెర్షన్ ను విడుదల చేయడానికి రాజమౌళితో చర్చలు జరుపుతోందని వార్తలు వస్తున్నాయి. డబ్బింగ్ పనులు మరియు ప్రమోషన్ లకు తగినంత సమయం పడుతుంది కాబట్టి.. దీనిపై జక్కన్న అండ్ టీమ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట.
ఇకపోతే అక్టోబర్ 29న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం నుంచి సినీ అభిమానులకు ఓ స్పెషల్ అప్డేట్ రాబోతోంది. 46 సెకండ్ల ఓ వీడియోని మేకర్స్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇది టీజర్ అనౌన్స్ మెంట్ వీడియో కూడా అయ్యుండే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన టీజర్లలో ఇద్దరు హీరోలను విడివిడిగా చూపించిన జక్కన్న.. త్వరలో రాబోయే టీజర్ లో తారక్ - చరణ్ లను కలిపి చూపిస్తారని తెలుస్తోంది. దీని కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కాగా, అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా రెడీ చేసిన కల్పిత కథతో 'ఆర్ ఆర్ ఆర్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రపంచ బవ్యాప్తంగా పది బాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద దానయ్య 400 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ - రామ్ చరణ్ లతో పాటుగా అలియా భట్ - ఒలివియా మోరిస్ - అజయ్ దేవగన్ - శ్రియ శరణ్ - సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూర్చగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.