తన సినిమా అయినా ఇంకొకరిది అయినా నిర్మాత దిల్ రాజు ప్రమోషన్ విషయంలో చాలా బాలన్స్ గా మాట్లాడుతారని గతంలో పేరుండేది. ఈ మధ్య అతిశయోక్తులకు తెరతీయడంతో ఆయన విశ్వసనీయతపైనా అనుమానం వచ్చేలా చేస్తున్నారు. గత ఏడాది శ్రీనివాస కళ్యాణం టైంలో తెలుగు వరకు ఇంత వరకు రాని గొప్ప కుటుంబ కథ చిత్రం చూడబోతున్నారు అనే రేంజ్ లో హైప్ ఇచ్చారు. కట్ చేస్తే నితిన్ ఫ్యాన్స్ తలుచుకోవడానికి కూడా భయపడే డిజాస్టర్ మిగిలింది. ఆయన జడ్జ్ మెంట్ మీద లవర్ సమయంలోనూ ఇదే తరహ కామెంట్స్ వచ్చాయి.
మహర్షి విషయంలోను ఇలాంటి మాటలే అన్నారు. ఎంతైనా ఊహించుకుని రండి అంతకు మించి మహేష్ సినిమా ఉంటుందని చాలా ఊరించారు. తీరా నిన్న పబ్లిక్ టాక్ తో పాటు రిపోర్ట్స్ యునానిమస్ గా లేకపోవడం అభిమానులను కొంత ఆందోళనకు గురి చేస్తోంది. వీకెండ్ అయ్యాక క్లారిటీ వస్తుంది కాని మహర్షి దిల్ రాజు చెప్పినట్టు లేదా మహేష్ అన్నట్టు క్లాసిక్ మాస్టర్ పీస్ అనే మాట అయితే దక్కించుకోలేదు.
సోషల్ మీడియాలో సైతం మెసేజ్ బాగుంది కాని గత సినిమాల సమ్మేళనంలాగే ఫీలయ్యమని మహేష్ హీరోయిజం ఎలివేషన్ మీద పెట్టిన ఫోకస్ కాస్త కథా కథనాల మీద కూడా పెట్టి ఉంటే బాగుండేదని ఇలా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఫైనల్ స్టేటస్ తేలడానికి టైం పడుతుంది కాని మహర్షి విషయంలో దిల్ రాజు చెప్పిన మాట అక్షరాల జరగలేదన్నది కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం.