నోరా ఫతేహి అందచందాలు డ్యాన్సింగ్ ప్రతిభ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. బాహుబలి మనోహరిగా ఇప్పటికీ కుర్రకారు గుండెల్లో నిలిచి ఉంది. అద్భుతమైన డాన్సర్ గా .. అంతకుమించి హాట్ లుక్స్ ఉన్న నటిగా నోరాకి కెరీర్ పరంగా ఎలాంటి డోఖా లేదు. అల్ట్రా మోడ్రన్ వేషధారణలతో టోన్డ్ ఫిగర్ తో మ్యాజిక్ చేయడంలో నోరా తర్వాతే. ఫిలింమేకర్స్ తమ సినిమాల్లో నటింపజేయాలని.. నోరా ఎలక్ట్రిక్ డ్యాన్స్ మూవ్ లతో మసాలా సాంగ్స్ క్రియేట్ చేయాలని కోరుకుంటారు. సంగీత దర్శకులు మ్యూజిక్ వీడియోల కోసం ఒప్పందాలు చేసుకుంటున్నారు.
ఇటీవల బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి నోరా ఫతేహీని ఆహ్వానించారు. కానీ ఆ కార్యక్రమం అనూహ్యంగా రద్దయిందని తెలిసింది. ప్రపంచ పరిస్థితుల కారణంగా విదేశీ మారకద్రవ్య నిల్వలను ఆదా చేసేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు కథనాలొచ్చాయి.
సోమవారం బంగ్లాదేశ్ సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇదే విషయాన్ని ప్రకటిస్తూ నోటీసు జారీ చేసింది. "ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా .. విదేశీ మారక నిల్వలను కొనసాగించే లక్ష్యంతో Ms నోరా ఫతేహికి అనుమతి ఇవ్వలేదు" అని సదరు శాఖ ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది.
నిజానికి నోరా ఉమెన్ లీడర్ షిప్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమానికి డ్యాన్సర్ గా హాజరు కావాల్సి ఉంది. ఆమె వేదికపై నృత్యం చేయాలని.. ఈవెంట్ లో అవార్డులను అందజేయాలని భావించారు. కానీ అది వీలుపడలేదు. అక్టోబర్ 12 నాటికి 36.33 బిలియన్ డాలర్లకు పడిపోయిన విదేశీ మారక నిల్వల మధ్య డాలర్ చెల్లింపులపై సెంట్రల్ బ్యాంక్ పరిమితులను మంత్రిత్వ శాఖ ప్రస్తావించింది.
ఏడాది మునుపు 46.13 బిలియన్ల డాలర్లుగా ఇది ఉంది. దాదాపు నాలుగు నెలల దిగుమతులను కవర్ చేయాల్సి ఉందని వ్యాఖ్యానించింది. అయితే బంగ్లాదేశ్ విదేశీ మారక నిల్వలకు నోరా ఫతేహి డ్యాన్సింగ్ షోకి సంబంధం ఏమిటో కొంతవరకూ క్లారిటీ మిస్సయిందని అభిమానులు సోషల్ మీడియాలలో వాపోతున్నారు.
నోరా ఫతేహి ప్రస్తుతం కరణ్ జోహార్ - మాధురీ దీక్షిత్ నేనేతో కలిసి డ్యాన్స్ రియాలిటీ షో ఝలక్ దిఖ లాజా సీజన్ 10కి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. 'థాంక్స్ గాడ్' చిత్రం నుండి సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నోరా ఐటమ్ సాంగ్ 'మణికే..' ఆన్‌లైన్‌లో క్రేజీగా మారింది. అభిమానులు- సెలబ్రెటీలు నోరాకు చెందిన పాటలతో ఇటీవలి ట్యుటోరియల్ మాషప్ నంబర్ పై రీల్స్ ను సృష్టిస్తున్నారు. నోరా నుండి స్టెప్స్ కూడా నేర్చుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.