టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ తెర మీదే కాదు.. బయట కూడా భలే కామెడీ చేస్తుంటాడు. అతడి సెన్సాఫ్ హ్యూమర్ ఎలాంటిదో సోషల్ మీడియా జనాలకు బాగా తెలుసు. ట్విట్టర్లో కిషోర్ ట్వీట్ వేశాడంటే అందులో కచ్చితంగా ఫన్ ఉంటుంది. అతడి ఫాలోవర్లు సైతం కిషోర్‌కు తగ్గట్లే చాలా ఫన్నీగా ఉంటారు. కిషోర్‌కు అత్యంత సన్నిహితులైన యాక్టర్స్ కమ్ డైరెక్టర్స్ అడివి శేష్, రాహుల్ రవీంద్రన్‌లతో ట్విట్టర్లో జరిగే కాన్వర్జేషన్లు భలే ఆసక్తి రేకెత్తిస్తుంటాయి.
వీటిని వీరి ఫాలోవర్లు కూడా అందిపుచ్చుకుని ఫన్నీ పోస్టులు పెడుతుంటారు. తాజాగా ఒక నెటిజన్ వెన్నెల కిషోర్ నటించిన 'కపటధారి' సినిమాలోని ఒక సన్నివేశం తాలూకు వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసి ఆసక్తికర చర్చకు తెర తీశాడు. అందులో కిషోర్ పేల్చిన డైలాగ్ చూస్తే ఎవ్వరికైనా నవ్వు రాక మానదు. ఈ సినిమాలో కిషోర్ ట్రాఫిక్ పోలీస్ పాత్ర చేశాడు. తన కలీగ్ అయిన సుమంత్.. ట్రాఫిక్ పనులు వదిలేసి ఓ మర్డర్ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు.
అతణ్ని వారిస్తూ.. ''అయినా మనకేం తక్కువరా. చౌరస్తాలో నిలబడి సీటీ కొడితే ప్రతి సెలబ్రెటీ భయపడతాడురా. మొన్నటికి మొన్న అడివి శేష్ గాడు కారేసుకొస్తే హాయ్ చెప్పడానికి ముందుకెళ్తే.. రివర్స్ చేసుకుని భయపడి పారిపోయాడు. ఏం చేశాడో ఏంటో. అంతకంటే ఏం కావాలిరా'' అంటాడు వెన్నెల కిషోర్. ఈ సినిమాను డైరెక్ట్ చేసింది తమిళ దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి. కాబట్టి ఈ డైలాగ్‌లో అతడి ప్రమేయం లేకపోవచ్చు. శేష్‌తో తనకున్న సాన్నిహిత్యం దృష్ట్యా కిషోరే ఈ డైలాగ్ యధాలాపంగా చెప్పేసి ఉండొచ్చు.
సినిమాలో ఒక ఫ్లోలో ఈ డైలాగ్ వెళ్లిపోయింది కానీ.. ఒక నెటిజన్ దీని తాలూకు వీడియో తీసి ఇప్పుడు ట్విట్టర్లో పెట్టేశాడు. శేష్‌ను ట్యాగ్ చేసి ఎక్కడికి పారిపోయావ్ అని ప్రశ్నించాడు. దీనికి శేష్ బదులిస్తూ.. తనకీ సంగతే తెలియదన్నాడు. తర్వాత రాహుల్ రవీంద్రన్ లైన్లోకి వచ్చి.. 'ఏం చేశావో ఏంటో'' అని ట్వీట్ చేశాడు. ట్విట్టర్లో కిషోర్-శేష్-రాహుల్ కాన్వర్జేషన్లు, వారి కెమిస్ట్రీని బాగా ఎంజాయ్ చేసేవాళ్లను ఈ వ్యవహారం బాగానే ఆకట్టుకుంటోంది. ఇంతకీ దీనిపై కిషోర్ ఏమంటాడో చూడాలి.