కొద్ది రోజుల క్రితం ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై లైవ్ డిబేట్ సందర్భంగా ఓ టీవీ చానెల్ న్యూస్ ప్రజెంటర్ వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లోని మహిళలనుద్దేశించి అసభ్య పదజాలంతో సదరు న్యూస్ ప్రజెంటర్ దూషించడంతో....టాలీవుడ్ మండిపడింది. అతడిపై కేసు నమోదు చేసింది. అయితే, పొరపాటున అలా అన్నానని సదరు న్యూస్ ప్రజెంటర్ క్షమాపణలు కోరుతున్నట్లు...ఆ చానెల్ లో స్క్రోలింగ్ కూడా వేశారు. దీంతో, ఆ వివాదం సద్దుమణిగిపోయిందని అంతా భావించారు. అయితే, క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా తనను కొందరు టాలీవుడ్ ప్రముఖులు దూషించారని సదరు న్యూస్ ప్రజెంటర్ గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. అంతేకాకుండా, వారందరికీ కోర్టు ద్వారా నోటీసులు కూడా పంపినట్లు తెలుస్తోంది.
శ్రీరెడ్డి - ఆర్జీవీ - పవన్ కల్యాణ్....వంటి అంశాలపై కొద్ది రోజులుగా మీడియా విపరీతంగా ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. కొన్ని మీడియా చానెళ్లకు పవన్ కు మధ్య వెర్బల్ వార్ కూడా నడిచింది. చివరకు ఎలాగోలా ఉభయపక్షాలు రాజీకొచ్చి ఎవరి పనులు వారు చూసుకుంటున్నారు. అయితే, తాజాగా ఆ చానెల్ న్యూస్ ప్రెజెంటర్ పంపిన నోటీసులపై టాలీవుడ్ లో చర్చోపచర్చలు జరుగుతున్నాయట. బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా తనను దూషించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ....కోర్టు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ నోటీసులు అందుకున్న వారితో పాటు వారికి సంఘీభావంగా టాలీవుడ్ మొత్తం కదలాలని ప్లాన్ చేస్తోందట. జూన్ 5న కోర్టు హియరింగ్ జరగవచ్చని...ఆ రోజు దాదాపుగా టాలీవుడ్ మొత్తం కోర్టు దగ్గర ప్రత్యక్షమయ్యే అవకాశముందని పుకార్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తమకు సంబంధించిన సమావేశాలను ఫిల్మ్ చాంబర్ - స్టూడియోల్లో కాకుండా ఎవరో ఒకరి ఇళ్లలో పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారట. మరి, తాజా వివాదం ఎక్కడి వరకు వెళుతుందో వేచి చూడాలి.