త్రిష దశ 1999లో అలా తిరిగింది

Update: 2016-10-01 10:21 GMT
సెప్టెంబర్ 30, 1999. చెన్నయ్ నగరంలో 'మిస్ చెన్నయ్' ఈవెంట్ ఫైనల్ కాంపిటీషన్ జరుగుతోంది. విన్నర్ ను డిక్లేర్ చేశారు. పదహారేళ్ళ త్రిష కృష్ణన్ అనే అమ్మాయి 'మిస్ చెన్నయ్' గా ఎంపికైంది. అయితే ప్రతీ ఏడాది ఇలాంటి అమ్మాయి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కాని.. 1999లో సెలక్ట్ గెలిచిన ఆ అమ్మాయి మాత్రం.. ఏకంగా తమిళనాడులోనే కాకుండా పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రలంలో కూడా చెరగని ముద్రవేసింది.

చిన్న చిన్న ప్రొడక్టులకు మోడలింగ్ చేస్తూ.. అవసరమైతే బికినీల్లో కూడా ఫోజులిచ్చిన ఆ మోడల్.. చివరకు చిన్న సినిమాలతో హీరోయిన్ గా పరిచయమైంది. వెంటనే పెద్ద హీరోల నుండి ఆఫర్లు కూడా వచ్చాయి. అలా తెలుగులో వర్షం వంటి సినిమాతో మెగా బ్రేక్ వచ్చేసింది. ఇంకేముంది.. మిస్ చెన్నయ్ కాస్తా స్టార్ హీరోయిన్ త్రిష అయిపోయింది. అప్పటినుండి తిరుగులేకుండా సినిమాల్లో నటిస్తూ.. ఏదో ఓ రెండు మూడు సంవత్సరాల క్రితం మాత్రం తన కెరియర్ కు యథావిథిగా బ్రేక్ వేసుకుంది అమ్మడు. 1999లో తిరిగిన దశతోనే ఇప్పటికీ నెట్టుకొస్తున్నానని త్రిష్ ఫీలింగ్ కూడా.

అందుకే నిన్న త్రిష తాను మిస్ చెన్నయ్ కిరీటం గెలవడం అనేది ఓ మర్చిపోలేని అనుభూతి అంటూ జ్ఞాపకాల్లోకి వెళిపోయింది. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News