కరోనా కారణంగా ప్రతీ స్టార్ హీరో సినిమా థియేటర్లలోకి వచ్చి చాలా రోజుల సమయం పట్టింది. అందరిలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కూడా థియేటర్లలోకి రావడానికి రెండేళ్లు పట్టింది. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ `సర్కారు వారి పాట`. యంగ్ క్రేజీ డైరెక్టర్ పరశురామ్ ఈ మూవీని రూపొందించారు. రెండేళ్ల విరామం తరువాత మహేష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మహేష్ అభిమానులు, ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూశారు.
అయితే `సర్కారు వారి పాట` ప్రచారానికి, హైప్ కి తగ్గ రేంజ్ లో సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోయింది. తొలి రోజే మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుని మరీ ముఖ్యంగా ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశకు గురిచేసింది.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోవడంతో మహేష్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ తో చేయబోతున్న SSMB28పై అంచనాలు పెట్టుకున్నారు. దాదాపు 12 ఏళ్ల విరామం తరువాత మహేష్ - త్రివిక్రమ్ ల కలయికలో రాబోతున్న సినిమా కావడంతో సహజంగానే ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఏర్పడ్డాయి.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఎస్. రాధాకృష్ణ ఈ భారీ ప్రాజెక్ట్ ని నిర్మించబోతున్నారు. ప్రాజెక్ట్ ప్రకటించి ఏడాది కావస్తున్నా వివిధ కారణాల వల్ల ఈ మూవీ ముందుకు సాగడం లేదు. మహేష్ `సర్కారు వారి పాట` రిలీజ్ తరువాత ఫ్యామిలీతో కలిసి విదేవాలకు వెకేషన్ కు వెళ్లారు. ఇటలీలో విహరించిన మహేష్ ప్రస్తుతం అమెరికాలో వున్నారు. తిరిగి రాగానే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇంత వరకు ఎలాంటి అప్ డేట్ బయటికి రావడం లేదు. ఇదీ కాకుండా ఈ మూవీపై రక రకాల ఊహాగానాలు పుట్టుకొస్తున్ంనాయి. ఇదొక పీరియాడిక్ స్టోరీ అని, రెండు కాలల్లో సాగుతుందని, మహేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని వార్తలు మొదలయ్యాయి. ఇదిలా వుంటే ఈ ప్రాజెక్ట్ గురించి హీరో మహేష్ బాబాయ్ జి. ఆదిశేషగిరిరావు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో SSMB28పై స్పందించారు.
మహేష్ - త్రివిక్రమ్ ల సినిమా జూలైలో మొదలవుతుందని, వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తుందని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు హీరో, డైరెక్టర్, మేకర్స్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదని అడిగితే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసే రోజు వివరాలన్నీ వెల్లడిస్తారని స్పష్టం చేశారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.
కొంత మంది మాత్రం సక్రాంతికి రిలీజ్ కావడం అసాధ్యం అని వాదిస్తుంటే మరి కొంత మంది మాత్రం జూలై లో స్టార్ట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేయడానికి బోలెడు టైమ్ వుందని, ఖచ్చితంగా సంక్రాంతికి రిలీజ్ చేయడం ఖాయం అని చెబుతున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తుండగా మది ఛాయాగ్రహణం, ఏ.ఎస్. ప్రకాష్ ఆర్ట్, ఎడిటింగ్ నవీన్ నూలి అందించబోతున్నారు.