#RC15 టైటిల్ పై ఫైన‌ల్ గా ఏం తేల్చారు?

Update: 2022-06-20 04:28 GMT
మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్ డ‌మ్ పై క‌న్నేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ త‌ర‌హాలోనే చ‌ర‌ణ్ ప్ర‌ణాళిక‌ల్లో వేగం పెరిగింది. అత‌డు బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా ద‌ర్శ‌కుల్ని ఎంపిక చేయ‌డం వెన‌క లాజిక్ వ‌ర్క‌వుట‌వుతోంది. ఇప్ప‌టికే ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో ఆర్.ఆర్.ఆర్ లాంటి సెన్సేష‌న‌ల్ హిట్ చిత్రంలో న‌టించి హాట్ టాపిక్ గా మారాడు. ఆర్.ఆర్.ఆర్ లో చ‌ర‌ణ్ చేసిన సీతారామ‌రాజు పాత్ర‌కు గొప్ప పేరొచ్చింది. అతడి ఎన‌ర్జిటిక్ పెర్ఫామెన్స్ ని అమెరికా స‌హా ప్ర‌పంచ దేశాల్లో ప్ర‌ముఖులు కొనియాడారు. ప్ర‌ముఖ హాలీవుడ్ ద‌ర్శ‌కులు న‌టీన‌టులు కూడా ఆర్.ఆర్.ఆర్ తార‌ల న‌ట‌న‌ను ప్ర‌శంసించారు.

ఇక‌పూ చెర్రీ కింక‌ర్త‌వ్యం ఏమిటీ? అంటే త‌దుప‌రి మ‌రో పాన్ ఇండియా ద‌ర్శ‌కుడు శంక‌ర్ తో చేస్తున్న సినిమాని విజ‌య‌ప‌థంలో న‌డిపించ‌డ‌మే.  చర‌ణ్ ఈ సినిమా కోసం రేయింబ‌వ‌ళ్లు ఎంతో హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాడు. మ‌రోసారి మ్యాసివ్ పాన్ ఇండియా హిట్ కొట్టాల‌న్న‌ది అత‌డి పంతం. ఇక ఆర్.సి 15 కంటెంట్ పైనా టైటిల్ పైనా చర‌ణ్ ఎక్కువ ఆస‌క్తిగా ఉన్నారు. ఇప్పుడు టైటిల్ ని ఫైన‌ల్ చేయాల్సిన టైమ్ ద‌గ్గ‌ర ప‌డింది.

త‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు శంక‌ర్- దిల్ రాజుతో చ‌ర‌ణ్ దీనిపై చ‌ర్చోచ‌ర్చ‌లు సాగిస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే టైటిల పై ఒక్కొక్క‌రి ఎంపిక ఒక్కోలా ఉంది. నిజానికి ఈ చిత్రానికి స‌ర్కారోడు! అనే టైటిల్ ని ఎంపిక చేయాల‌ని దిల్ రాజు భావిస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే శంక‌ర్ మాత్రం ఆఫీస‌ర్ (అధికారి) అనే టైటిల్ పై మొగ్గు చూపుతున్నార‌ని తెలిసింది.

స‌ర్కారోడు వ‌ర్సెస్ ఆఫీస‌ర్!  ఈ రెండిటిలో ఏది బెస్ట్ అన్న‌ది తేలాల్సి ఉందిట‌. అయితే చ‌ర‌ణ్ మాత్రం శంక‌ర్ ఎంపిక చేసుకున్న ఆఫీస‌ర్ టైటిల్ ని ఫైన‌ల్ చేయాల్సిందిగా సూచించిన‌ట్టు క‌థ‌నాలొస్తున్నాయి. ఆఫీస‌ర్ టైటిల్ ఎంతో క్లాసీగా ఉంది. అలాగే దీనికి యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ కూడా ఉంది. కానీ దిల్ రాజు ఎంపిక చేసుకున్న స‌ర్కారోడు మాసీగా ఉంది. పైగా పూర్తి లోక‌ల్ టైటిల్ ఇది. దీనికి పాన్ ఇండియా రీచ్ క‌నిపించ‌డం లేదు.

నిజానికి ఒక‌ నిజాయితీ గల IAS అధికారి జీవితం ఎలా సాగింది? అన్న కాన్సెప్టుతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇందులో చ‌ర‌ణ్ సీఎం పాత్ర‌లోనూ క‌నిపిస్తార‌న్న టాక్ ఉంది. అందుకే చ‌ర‌ణ్ పాత్ర‌కు త‌గ్గ‌ట్టు ఆఫీస‌ర్ లేదా అధికారి యాప్ట్ టైటిల్ అని కూడా చెప్పొచ్చు.

కానీ సుదీర్ఘ త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌ల అనంత‌రం చివ‌రికి ఏ టైటిల్ ని ఫైన‌ల్ చేస్తారు? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇక ఆ రెండు టైటిల్స్ కాకుండా మెగాభిమానులు ఇంకేదైనా యూనివ‌ర్శ‌ల్ త‌ర‌హా న‌వ్య‌పంథా టైటిల్ ని చెబుతారేమో చూడాలి.
Tags:    

Similar News