మెగా మేనల్లుడు, సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ''ఉప్పెన''. దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ కలిసి ఈ సినిమాని నిర్మించాయి. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా.. 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని ముందుగా గతేడాది వేసవిలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. అదే సమయంలో కరోనా ప్రభావం పడటంతో సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. థియేటర్స్ రీ ఓపెన్ అయితే 'ఉప్పెన' రిలీజ్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అందరూ భావించారు.
నిజానికి 'ఉప్పెన' సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని సుకుమార్ ఆలోచించాడట. ఫెస్టివల్ సీజన్ అయితే మంచి వసూళ్లు వస్తాయని మైత్రీ టీమ్ కి సుక్కు పదే పదే చెబుతూ వచ్చేవాడట. అయితే సుకుమార్ ప్రెడిక్షన్స్ ఏమైందో ఏమో కానీ 'ఉప్పెన' సంక్రాంతి రేసులో లేదు. ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం మెగా హీరో డెబ్యూ మూవీని ఫిబ్రవరిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి మేకర్స్ పెట్టిన బడ్జెట్ ని బట్టి ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ దాదాపు 20 కోట్లు పైనే రాబట్టాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుంది. మరి ప్రస్తుత పరిస్థితుల్లో వైష్ణవ్ తేజ్ మీద అంత పెట్టుబడి రిటర్న్స్ రాబట్టాలంటే కాస్త కష్టమైనే పని అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందులోనూ ఈమధ్య హార్డ్ కోర్ మెగా ఫ్యాన్స్ కూడా ముందు మాదిరి వారసుల్ని ఎంకరేజ్ చేయడం లేదు. సినిమా బాగుంటే చూస్తున్నారు.. బాగోకపోతే బాగాలేదని చెప్పేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'ఉప్పెన' సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.