రాజ్ త‌రుణ్ ప‌రిస్థితి ఏంటిప్పుడు?

Update: 2022-07-21 02:30 GMT
యంగ్ హీరో రాజ్ త‌రుణ టాలీవుడ్ కి ఉవ్వెత్తున దూసుకొచ్చిన యువ కెర‌టం. `ఉయ్యాల జంపాల‌`తో లాంచ్ అయిన కుర్రాడు అటుపై హీరోగా కొన్ని సినిమాల్లో న‌టించి మెప్పించాడు. `సినిమా చూపిస్తా మావ‌`..`కుమారి 21 ఎఫ్`.. `నాన్న నేను నా బోయ్ ప్రెండ్`.. `కిట్టు న్నాడు జాగ్ర‌త్త` లాంటి చెప్పుకోవాల్సిన సినిమాలు కొన్ని ఉన్నాయి.

వీటితో పాటు చాలా సినిమాల్లో న‌టించాడు. కానీ అవేవి రాజ్ త‌రుణ్ మార్కెట్ ని బిల్డ్ చేయ‌లేక‌పోయాయి. థియేట‌ర్లోకి  వ‌చ్చాయి.వెళ్లాయి త‌ప్ప‌! ఏరకంగానూ  రాజ్ త‌రుణ్ కి ఆ సినిమాలు పెద్ద‌గా పనికొచ్చిన సంద‌ర్భం క‌నిపించ‌లేదు. హిట్ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే న‌టుడిగా నైనా రాజ్ త‌రుణ్ ని ఏమైనా పైకి  లేపిన చిత్రాలుగా  చెప్పాల‌న్నా ఆలోచించాల్సిన ప‌రిస్థితే.

`అంద‌గాడు`తో యావ‌రేజ్ స‌క్సెస్ అందుకున్న త‌ర్వాత వ‌రుస‌గా ఏడెనిమిది  సినిమాలు చేసాడు. అవేవి కూడా యంగ్ హీరోకి క‌లిసి రాలేదు. చివ‌రిగా ఇదే ఏడాది మార్చిలో  `స్టాండ‌ప్ రాహుల్` తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. రిలీజ్ కి ముందు ఆ సినిమా పై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. కానీ రిలీజ్ త‌ర్వాత అవ‌న్నీ అడియాశ‌ల‌గానే మిగిలిపోయాయి.

ప్ర‌స్తుతం రాజ్ త‌రుణ్ చేతిలో  ఎమన్నా సినిమాలు ఉన్నాయా లెవా అనే విషయం కూడా తెలియడం లేదు  . క‌థ‌లు వింటున్న‌ట్లు ప్ర‌చారం కూడా రాలేదు. మ‌రి  తాజా ప‌రిస్థితుల్ని బ‌ట్టి!  రాజ్ త‌రుణ్ ని వెనక్కి నెట్టిన‌ట్లే క‌నిపిస్తుందా? మార్కెట్ పై వైఫ‌ల్యాల ప్ర‌భావం పడిందంటారా? అంటే అవున‌నే టాక్  వినిపిస్తుంది. వ‌రుస వైఫ‌ల్యాలు రాజ్ త‌రుణ్  వేగాన్ని త‌గ్గించ‌డానికి ఓ కార‌ణంగా వినిపిస్తుంది.

నిర్మాతల అంచ‌నాల్ని అందుకోవ‌డంలో యంగ్ హీరో విఫ‌ల‌మయ్యాడ‌ని టాక్ న‌డుస్తోంది. మ‌రి వీట‌న్నింటిని తిప్పికొట్టాలంటే యంగ్ హీరో ఓ అవ‌కాశం అందుకోవాలి. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అప్పుడే ఈ విమ‌ర్శ‌ల‌కి చెక్ పెట్టే అవకాశం ఉంది.

అయితే రాజ్ త‌రుణ్  ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ర్టీకి  వ‌చ్చాడు. షార్ట్ ఫిలిం న‌టుడిగా ప‌రిచ‌య‌మై వాటితో ఫేమ‌స్ అయి సినిమాల్లో అవ‌కాశాలు అందుకున్నాడు. ఆ ర‌కంగా రాజ్ త‌రుణ్ ని  తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో ఎప్పుడు ఉంటాడు.
Tags:    

Similar News