బాలీవుడ్‌ లో 'ఆర్‌ఆర్‌ఆర్‌' పరిస్థితి ఏంటీ?

Update: 2021-08-30 15:30 GMT
కరోనా కారణంగా ఏడాదిన్నరగా కాలంగా బాలీవుడ్‌ లో శూన్యం ఏర్పడింది. కొన్ని సినిమాలను ఓటీటీ ద్వారా విడుదల చేసినా కూడా పెద్ద సినిమాల విడుదల గత ఏడాదిన్నర కాలంగా అగమ్య గోచరంగా మారింది. బాలీవుడ్‌ లో సినిమాలు విడుదల అవుతున్నా కూడా వసూళ్ల విషయంలో తీవ్ర నిరాశ పర్చాయి. ఇటీవల విడుదల అయిన అక్షయ్‌ కుమార్‌ బెల్‌ బాటమ్‌ మరియు అమితాబచ్చన్ మూవీ కూడా బాలీవుడ్‌ లో ఇటీవల థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాని కరోనా భయం ఇంకా ఉండటం వల్ల థియేటర్లకు జనాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

బాలీవుడ్‌ లో సినిమాలు విడుదల చేయాలంటే కాస్త టెన్షన్ గానే ఉంది. గత ఏడాదిన్నర కాలంగా బాలీవుడ్‌ లో ఏ ఒక్క సినిమా కూడా కనీసం పాతిక కోట్ల ను వసూళ్లు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. థియేటర్ల ద్వారా విడుదల చేయడం వల్ల భారీ నష్టాలు తప్పడం లేదు. ఓటీటీ ద్వారా విడుదల చేయడం వల్ల మంచి లాభాలు వస్తున్న ఈ సమయంలో ఎందుకు థియేటర్ల ద్వారా విడుదల చేయాలని కొందరు భావిస్తున్నారు. అందుకే ఓటీటీ కే కొందరు నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. కాని పెద్ద సినిమాలు మాత్రం థియేటర్ విడుదల కోసం వెయిట్‌ చేస్తున్నాయి.

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పలు సినిమాలు కూడా బాలీవుడ్‌ మార్కెట్‌ పై ఆశలు పెట్టుకుని ఉన్నాయి. ఈ సమయంలో బాలీవుడ్‌ లో విడుదల చేయడం వల్ల ఎంత వరకు మన సినిమాలకు అక్కడ వసూళ్లు నమోదు అవుతాయి అనేది క్లారిటీ లేదు. కనుక ఆర్ ఆర్ ఆర్‌ సినిమా విడుదల ఇప్పట్లో విడుదల చేయకూడదని భావిస్తున్నారు. బాహుబలి సినిమా బాలీవుడ్‌ లో భారీగా వసూళ్లను రాబట్టింది. కనుక ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా కూడా భారీగానే వసూళ్లు రాబడుతుందనే నమ్మకం ఉంది. ప్రముఖ సంస్థ డబ్బింగ్‌ రైట్స్ ను దక్కించుకుంది. అక్కడ భారీగా విడుదల చేసి సూపర్ హిట్ అయితే తప్ప కమర్షియల్‌ సక్సెస్ అయినట్లు. థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్ అయ్యి పరిస్థితులు సాదారణ స్థితికి వస్తేనే ఆర్ ఆర్‌ ఆర్ ను విడుదల చేస్తామని మేకర్స్‌ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News