సమంత వాచ్ ధర ఎంతంటే?
సాధారణ దుస్తుల్లోనే తనలో ఫ్యాషన్ క్వాలిటీని హైలైట్ చేయడంలో సామ్ ప్రత్యేకం.
సమంత స్టైలిష్ డిజైనర్ దుస్తుల్లో కనిపించడం రేర్. ఫోటో షూట్లు ఉంటే? తప్ప స్టైలిష్ ఎంపికల జోలికి వెళ్లదు. కానీ తనలో అంతకు మించిన ఫ్యాషన్ క్వాలిటీని మాత్రం ప్రతీ సందర్భంలో హైలైట్ చేస్తుంటుం ది. అందులో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును చాటుతుంది. సాధారణ దుస్తుల్లోనే తనలో ఫ్యాషన్ క్వాలిటీని హైలైట్ చేయడంలో సామ్ ప్రత్యేకం. తాజాగా అమ్మడు న్యూ అరైవల్స్ లో ఇలా మెరిసింది.
పాస్టెల్ గ్రీన్ కో ఆర్డ్ సెట్ డిజైన్ లో ఆకర్షణీయంగా ముస్తాబైంది. డ్రెస్ మ్యాచింగ్ యాక్సరసీస్ ని ఎంపిక చేసుకుంది. అమ్మడి మ్యాకప్ అలంకరణ ఆకట్టుకుంటుంది. చెవులకు బంగారు పోగులు ధరించింది. ఇక చేతికి అమ్మడు ఖరీదైన వాచ్ ని ధరించింది. విలాసవంతమైన బల్గారీ రసర్పెంటీ వాచ్ ధరించింది. ఆ వాచ్ చేతిని మరింత అందంగా తీర్చి దిద్దింది.
దీని ధర భారీగా ఉంటుందని నెటిజనులు గెస్ చేస్తున్నారు. ధర ఎంత అనే దానిపై సెర్చింగ్ సాగుతోంది. అంచనాల ప్రకారం ధర 45 లక్షలకుపైగానే ఉంటుందని సమాచారం.ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అభిమానులు సమంత బ్యూటీకి ఫిదా అవుతున్నారు. సమంత రూప లావణ్యంలో ఎలాంటి మార్పులు రాలేదని..మునుపటి అందాన్ని మెయింటెన్ చేస్తుందని ఓ అభిమాని పోస్ట్ పెట్టాడు.
ఇక సమంత కెరీర్ ని మళ్లీ బిజీగా మార్చే పనిలో ఉంది. త్వరలోనే `సీటాడెల్` ఇండియన్ వెర్షన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే కొత్త సినిమాలకు రెడీ అవుతుంది. కొంత కాలంగా బాలీవుడ్ లో ఉండి అక్కడ నుంచి యాక్టివిటీస్ అన్నింటిని కొనసాగిస్తుంది.