ఆ హీరోని అంతం చేసినట్టే నిన్ను కూడా.. మెగాస్టార్‌కి వార్నింగ్!
ఇంతకీ ఆ రచయితల ద్వయం ఎవరు? అంటే సలీం-జావేద్.
రచయితల సూపర్ పవర్స్ గురించి మాట్లాడాలంటే ముందుగా టాలీవుడ్ లో పరుచూరి బ్రదర్స్ గుర్తుకు వస్తారు. వారి అసమాన చరిత్ర అలాంటిది. ఇండస్ట్రీ నాలుగు మూల స్థంబాలు అని చెప్పుకునే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతో పాటు అంతకుముందు ఉన్న లెజెండరీ హీరోలతోను ఈ రచయితల ద్వయం పనిచేసారు. వారి రచనలతో సినిమాలను బ్లాక్ బస్టర్లుగా మలిచారు. అయితే బాలీవుడ్ లో లెజెండ్ లను తయారు చేసిన స్టార్ రైటర్స్ ద్వయం గురించి మీకు తెలుసా? ఇటీవలే వారికి సంబంధించిన ఒక డాక్యుమెంటరీ రిలీజై సంచలనం సృష్టించింది. ఇంతకీ ఆ రచయితల ద్వయం ఎవరు? అంటే సలీం-జావేద్. బాలీవుడ్ ని శాసించిన లెజెండరీ రచయితలు ఈ ఇద్దరూ.
వీళ్లు ఎంతగా ఎదిగారు? అంటే.. శాసించేంతగా..! అప్పటికే ఇండస్ట్రీలో స్థిరపడిన స్టార్ హీరోలను సైతం బెదిరించేంత దమ్మున్న మొనగాళ్లుగా ఈ రచయితలు పేరు బడ్డారు. వారి బెదిరింపులతో ముడిపడిన ఒకానొక ఘటనను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. రచయితలు సలీం ఖాన్ - జావేద్ అక్తర్ చిత్ర పరిశ్రమలో తమను తాము సుస్థిరం చేసుకున్న సమయంలోనే నటుడు రిషి కపూర్ తన నటనా రంగ ప్రవేశం చేశారు. అయితే రిషీజీ లెజెండరీ రచయితలను తిరస్కరించారు. ఒకటి కంటే ఎక్కువ సందర్భాలలో వారిని రిషీకపూర్ విభేదించారు. వారు రాసిన చిత్రంలో నటించేందుకు రిషి తిరస్కరించడంతో సలీం ఖాన్‌కు అంతులేని కోపం వచ్చింది. అతడు రిషీకపూర్ ని హెచ్చరించాడు. మరోవైపు రిషీకపూర్ నటించిన తొలి చిత్రం `బాబీ`(1973) బ్లాక్‌బస్టర్‌గా మారింది.
తన ఆత్మకథ `ఖుల్లాం ఖుల్లా`లో రిషి కపూర్ ఈ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. తాను `త్రిశూల్` సినిమా చేయడానికి నిరాకరించినప్పుడు ఆగ్రహించిన సలీం ఖాన్ తనను బెదిరించిన విషయాన్ని బయోగ్రపీ లో గుర్తుచేసుకున్నారు. తన తిరస్కరణకు సలీం-జావేద్ చిన్నబుచ్చుకున్నారని, ముంబై హోటల్‌లో సలీమ్‌ని వ్యతిరేకించినప్పుడు శత్రుత్వం ఎగసిపడిందని అతడు రాశాడు. నేను స్నూకర్ గేమ్ ఆడుతున్నప్పుడు సలీం సాబ్ నన్ను అడిగాడు. సలీం-జావేద్‌ను తిరస్కరించే ధైర్యం నీకు ఎలా వచ్చింది? అని అడిగారు. నాకు ఆ పాత్ర నచ్చలేదు అని చెప్పాను!
అయితే ఆ కోపంలోనే అమితాబ్ బచ్చన్ ని సలీమ్ - జావేద్ ద్వయం స్టార్ ని చేసేందుకు చేయాల్సినదంతా చేసారు. అమితాబ్ బచ్చన్‌ను లాంచ్ చేయడం గురించి సలీం ఖాన్ ప్రగల్భాలు పలికారని, ఒకసారి వారిని తిరస్కరించినందుకు రాజేష్ ఖన్నా వద్దకు అదే కథను తీసుకెళ్లారని రిషి కపూర్ గుర్తు చేసుకున్నాడు. బాలీవుడ్ కి ప్రతిభావంతుడైన హీరోని అందించారు ఈ రచయితలు. అమితాబ్ రాకతో రాజేష్ ఖన్నా కెరీర్ దెబ్బతిందని కూడా రిషి ఖన్నా అన్నారు. సలీం సాబ్ నాతో ప్రగల్భాలు పలికాడు.. ఈ రోజు వరకు ఎవరూ మాకు నో చెప్పలేదని మీకు తెలుసా? మేం మీ కెరీర్‌ను నాశనం చేయగలం! అని హెచ్చరించారని రిషీజీ గుర్తు చేసుకున్నారు.
రిషి నేరుగా సలీం ఖాన్‌ను తన మనసులో ఏముందని అడిగినప్పుడు ``మీతో ఎవరు పని చేస్తారు? మీకు తెలుసా, మేము రాజేష్ ఖన్నాకు `జంజీర్` లాంటి బ్లాక్ బస్టర్ ఇవ్వాలనుకున్నాం. అతడు మమ్మల్ని తిరస్కరించాడు. మేము అతడిని నాశనం చేయడానికి ఏమీ చేయలేదు కానీ అతడికి ప్రత్యామ్నాయంగా అమితాబ్‌ని సృష్టించాము.. అని అన్నారు. రాజేష్ ఖన్నాను నాశనం చేసిన అమితాబ్ బచ్చన్ అనే హీరోని గుర్తు పెట్టుకోండి. మేము మీకు అలాగే చేస్తాం.. అని రిషీజీని హెచ్చరించారు. అయితే ఆ రోజు ఆ వాగ్వాదం మరింతగా పెరగలేదని రిషిజీ తన బయోగ్రఫీ పుస్తకంలో రాశారు. సలీం-జావేద్ కెరీర్ ఇటీవల ప్రైమ్ వీడియో డాక్యుమెంటరీ సిరీస్ `యాంగ్రీ యంగ్ మెన్` రూపంలో స్ట్రీమింగ్ అయింది. ఇద్దరు రచయితలు 1970లలో రికార్డ్ బ్రేకింగ్ హిట్‌లను అందించారు. కానీ 1980లలో అకస్మాత్తుగా విడిపోయారు. అయితే అమితాబ్ ఎదగడానికి కారణం అతడు గొప్ప నటుడని జావేద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.