దేవరకు సెకెండ్ హీరో అతనే..

సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తన టాలెంట్ తో ఎలాంటి గుర్తింపు సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే.

Update: 2024-09-29 16:30 GMT

సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తన టాలెంట్ తో ఎలాంటి గుర్తింపు సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ శిష్యుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన.. తక్కువ టైమ్ లోనే ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు. హీరో ధనుష్ మూవీ ద్వారా పరిచయం అవ్వగా.. మొదటి సినిమాతోనే తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు అనిరుధ్.

ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకు మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయారు. చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. రజినీకాంత్, విజయ్ దళపతి, అజిత్ వంటి పలు బడా హీరోల సినిమాలకు వర్క్ చేస్తున్నారు. తన మ్యూజిక్ తో సినిమాలోని కొన్ని సీన్స్ ను నిలబెట్టే సత్తా అనిరుధ్ కు ఉందన్న విషయం.. ఇప్పటికే జైలర్, విక్రమ్ ద్వారా ప్రూవ్ అయింది. ఇప్పుడు మరోసారి జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీతో రుజువైంది.

మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవరకు ఎన్టీఆర్ యాక్టింగ్, అనిరుధ్ వర్క్.. బిగ్ అసెట్స్ గా మారాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. సినిమాలోని కొన్ని అద్భుతమైన సీన్స్ కు అనిరుధ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్ లో ఉందనే చెప్పాలి. ఆయన వర్క్ తో పలు సీన్స్ ఫుల్ ఎలివేట్ అయ్యాయి. అలా తనపై పెట్టుకున్న అంచనాలను నిలబెట్టారు అనిరుధ్. బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు.

ముఖ్యంగా సినిమాలోని నాలుగు సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్స్ గా నిలవగా.. ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. దేవర మూవీకి అద్భుతంగా వర్క్ చేసిన అనిరుధ్ పట్ల అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. విమర్శకులు కూడా మెచ్చుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఆయన.. మొదట్లో అంతగా అవకాశాలు అందుకోలేకపోయారు. ఆ తర్వాత నాని మూవీకి వర్క్ చేసి తన టాలెంట్ తో తెలుగు సినీ ప్రియులను మెప్పించారు.

ఇప్పుడు దేవరతో అంచనాలకు మించి అలరించారు. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో తన సత్తా ఏంటో చూపించారు. మూవీకి సెకండ్ హీరోగా మారారు. కొన్ని అంశాల విషయంలో కొరటాల శివ జాగ్రత్త పడాల్సిందని రివ్యూలు వచ్చినా.. అనిరుధ్ వర్క్ ను ప్రశంసించని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు తెలుగులో మరిన్ని ప్రాజెక్టులకు పని చేస్తున్న అనిరుధ్.. ఫ్యూచర్ లో ఎలాంటి హిట్స్ అందుకుంటారో చూడాలి.

Tags:    

Similar News