శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య - సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం ''లవ్ స్టోరీ''. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ - అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నారాయణ దాస్ కె. నారంగ్ - పి. రామ్మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాతలుగా ఏషియన్ సినిమాస్ వారికి ఇది ఫస్ట్ సినిమా. అప్పుడెప్పుడో ప్రారంభమైన ఈ సినిమాని అనేక ఒడిదుడుకుల ఎదుర్కొని పూర్తి చేశారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని ఎట్టకేలకు థియేట్రికల్ విడుదలకు సిద్ధం చేశారు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల తర్వాత థియేటర్లలోకి వస్తున్న ఫస్ట్ క్రేజీ మూవీ 'లవ్ స్టోరీ'. అందుకే సినీ అభిమానులతో పాటుగా చిత్ర పరిశ్రమ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. పాజిటివ్ టాక్ వస్తే ఈ మూవీ మంచి వసూళ్ళు రాబడుతుందని అందరూ నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమా ఫలితం మీద మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశాజనకంగా ఉన్నాయి.
'లవ్ స్టోరీ' చిత్రానికి అన్నీ కలిపి దాదాపు 35 కోట్ల బడ్జెట్ అయినట్లు టాక్. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్మడుపోయినట్లు తెలుస్తోంది. ఏషియన్ వారు ఈ చిత్రాన్ని కొన్ని చోట్ల డైరక్ట్ రిలీజ్ చేసుకుంటున్నారు. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో నిర్మాతలు 20 కోట్ల థియేటర్ బిజినెస్ టార్గెట్ పెట్టుకున్నారని తెలుస్తోంది. శేఖర్ కమ్ముల సినిమాలకు ఏ-సెంటర్స్ లో మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా నైజాం - ఓవర్ సీస్ లలో మంచి కలెక్షన్స్ వస్తుంటాయి. నాగచైతన్య సినిమాలు బీ సీ సెంటర్లలో కూడా పర్వాలేదనిపిస్తాయి. ఆయన గత చిత్రాలు 'మజిలీ' 'వెంకీమామ' మంచి వసూళ్ళు రాబట్టిన సంగతి తెలిసిందే.
అందుకే ఇప్పుడు 'లవ్ స్టొరీ' చిత్రానికి మొదటి వారంలో నైజాం ఏరియాలో 10 కోట్లకు పైగా రావొచ్చని అంచనా వేస్తున్నారు. 'ఫిదా' సినిమా నైజాం లో 18 కోట్ల వరకు వసూలు చేయగా.. ప్రస్తుత పరిస్థితుల వల్ల లవ్ స్టోరీ టార్గెట్ తక్కువ పెట్టుకుంటున్నారు. ఇక ఆంధ్రాలో పదిహేను కోట్లకు పైగా ఎక్సపెక్ట్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చి వీకెండ్ వరకు కలెక్షన్లు డ్రాప్ అవ్వకపోతే.. ఈజీగా 30 కోట్ల పైనే రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఈ సినిమా ఏ మేరకు వసూలు చేస్తుందో చూడాలి.
'లవ్ స్టోరీ' తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన శేఖర్ కమ్ముల శైలి ఫీల్ గుడ్ మూవీ. కాకపోతే ఈసారి ప్రేమకథతోపాటు సమాజంలోని రెండు ప్రధాన సమస్యను ప్రస్తావించబోతున్నారు. ప్రస్తుత సమాజంలోని కుల సమస్యతో పాటు స్త్రీ వివక్షను ఇందులో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. హీరో నాగచైతన్య కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారని మేకర్స్ చెబుతున్నారు. ఇందులో తెలంగాణా యువకుడిగా ఆ యాసలో మాట్లాడడానికి బాగా కష్టపడ్డాడని తెలుస్తోంది. అంతేకాదు సాయి పల్లవితో పోటీగా డ్యాన్స్ చేయడానికి శ్రమించాడు. మరి ఈ సినిమా అక్కినేని హీరోకి ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో చూడాలి. భారీ అంచనాల మధ్య వస్తున్న 'లవ్ స్టొరీ' చిత్రానికి పవన్ సిహెచ్ అందించిన సంగీతం చాలా ప్లస్ అని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు మిలియన్ల వ్యూస్ అందుకొని చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ఇవి విజువల్ గా స్క్రీన్ మీద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాయో చూడాలి.