'భారతీయుడు 2' సినిమా వివాదం నేపథ్యంలో అగ్ర దర్శకుడు శంకర్ పై లైకా ప్రొడక్షన్స్ వారు మద్రాసు హైకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. 'ఇండియన్ 2' సినిమా పూర్తి చేయకుండా మరో సినిమా ఒప్పుకోవడం సరైనది కాదని.. ఈ సినిమాకు రూ.236 కోట్లు ఖర్చు చేశామని.. శంకర్ కు రెమ్యూనరేషన్ గా మాట్లాడుకున్న రూ.40 కోట్లలో రూ.14 కోట్లు ఇప్పటికే చెల్లించామని నిర్మాణ సంస్థ కోర్టుకు తెలిపింది. అయితే దీనిపై మద్రాస్ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఇరు పక్షాలు కూర్చొని ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యనించిందని తెలుస్తోంది.
'ఇండియన్ 2' చిత్రాన్ని గతేడాది మార్చి నాటికే కంప్లీట్ చేస్తానని శంకర్ మాటిచ్చాడని.. కానీ ఇప్పటికీ పూర్తి చేయకపోవడంతో తీవ్ర నష్టం ఎదురుకోవాల్సి వచ్చిందని లైకా ప్రొడక్షన్స్ వారు కోర్టుకు విన్నవించుకున్నారు. అలానే శంకర్ కూడా తన వాదనలని వినిపించారు. ఇటీవల మరణించిన నటుడు వివేక్ పై తీసిన సన్నివేశాలు మళ్లీ రీ షూట్ చేయాలని.. దీనికి మరికొంత సమయం పడుతుందని ఆయన కోర్టుకు తెలిపారని తెలుస్తోంది. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించింది. తదుపరి విచారణని ఏప్రిల్ 28కి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది.
కాగా, లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా 'ఇండియన్ 2' సినిమా స్టార్ట్ చేసాడు శంకర్. ఇది కమల్ - శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ 'భారతీయుడు' సినిమాకి సీక్వెల్. ఇందులో కాజల్ అగర్వాల్ - రకుల్ ప్రీత్ సింగ్ - బొమ్మరిల్లు సిద్ధార్థ్ - బాబీ సింహా - సముద్రఖని తదితరులను ఇతర ప్రధాన పాత్రల్లో తీసుకున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ఇప్పటికే 60 శాతం పూర్తైన ఈ సినిమా బడ్జెట్ విషయంలో నిర్మాతలకు శంకర్ కు మధ్య విబేధాలు రావడంతో నిలిచిపోయింది. అయితే ఇటీవల రామ్ చరణ్ తో శంకర్ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడంతో లైకా వారు కోర్టుకు వెళ్లారు.