ఫిక్ష‌న్ కాలంలో ఇప్పుడీ ఫ్యాక్ష‌నేంటి రాపో?

Update: 2021-05-29 07:30 GMT
ఇప్పుడంతా ఫిక్ష‌న్ సైన్స్ ఫిక్షన్ అంటున్నారు. బ‌డ్జెట్ల ప‌రంగా వీలు కుదిరితే సూప‌ర్ హీరో సినిమాల‌పైనే క‌న్నేస్తున్నారు. హీరోయిజం అంటే యూనివ‌ర్శ‌ల్ గా ఉండాల‌ని త‌పిస్తున్నారు. ఇదంతా టాలీవుడ్ లో క‌నిపిస్తున్న మార్పు. పాన్ ఇండియా ఒర‌వ‌డితో అంతా మారింది. టాలీవుడ్ ఎక్క‌డికో వెళ్లింది. ఇలాంటి స‌మ‌యంలో ఫ్యాక్ష‌న్ సినిమాలు చేస్తే జ‌నం చూస్తారా?

కానీ రామ్ అలియాస్ రాపో ఈసారి ఓ ఫ్యాక్ష‌న్ క‌థ‌ని ఎటెంప్ట్ చేస్తున్నారంటూ క‌థ‌నాలు జోరెక్కుతున్నాయి. లింగుస్వామి త‌న‌కు అచ్చి వ‌చ్చిన పందెంకోడి త‌ర‌హాలోనే ఫ్యాక్ష‌న్ సినిమాకి స‌న్నాహ‌కాల్లో ఉన్నార‌ని రామ్ పాత్ర ఇందులో ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుంద‌ని చెబుతున్నారు.

అయితే ఇటీవ‌లి కాలంలో ఫ్యాక్ష‌న్ పై ప్రేక్ష‌క‌జ‌నం ఆస‌క్తిగా ఉన్నారా? అంటే .. ఇంత‌కుముందు తార‌క్ హీరోగా త్రివిక్ర‌మ్ చేసిన అర‌వింద స‌మేత‌పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల్ని చూడాలి. సినిమా బావున్నా క్రిటిసిజం ఎదుర్కోక త‌ప్ప‌లేదు. ఇంకా బి.గోపాల్ రోజుల్ని రిపీట్ చేయాలంటే క‌ష్ట‌మే. మ‌రి లింగుస్వామి ఫ్యాక్ష‌న్ సినిమానే తీసినా కానీ దానిని యూనిక్ ఎలిమెంట్ జ‌త చేసి మిరాకిల్ చేస్తారేమో వేచి చూడాలి. ఇస్మార్ట్ శంక‌ర్ లాంటి వైవిధ్యం ఉన్న చిత్రంలో న‌టించిన రామ్ సెల‌క్ష‌న్ పై ఇటీవ‌ల అంచ‌నాలు పెరిగాయి. దానికి త‌గ్గ‌ట్టే లింగుస్వామితో ప్ర‌య‌త్నం ఉంటుంద‌నే ఆశిద్దాం.
Tags:    

Similar News