వాట్సాప్ ఛాటింగులే పట్టిచ్చాయ్

Update: 2017-07-15 05:18 GMT
డ్రగ్ రాకెట్ గుట్టు బయటపడ్డంతో ఇప్పుడు టాలీవుడ్ అతలాకుతలం అయిపోతోంది. డజన్ మందికి నోటీసులు అందించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే చాలామంది పేర్లు కూడా బయటకు వచ్చేశాయి. కొందరు సెలబ్రిటీలు కూడా తాము నోటీసులు అందుకున్న విషయాన్ని ధృవీకరించారు. ఇప్పటివరకూ చాలాసార్లు టాలావుడ్ లో డ్రగ్స్ దందా గురించి మాటలు వినిపించాయ్ కానీ.. ఒకేసారి ఇంతమంది పేర్లు బయటకు రావడం మాత్రం ఇదే మొదటిసారి.

దీనంతటికీ కారణం.. డ్రగ్ రాకెట్ లో పట్టుబడిన వారే. ఈ కేసులో అరెస్ట్ అయిన కెల్విన్ మస్కరెన్హాన్.. జీషన్ ఆలీ ఖాన్ ల మొబైల్ ఫోన్ లలో ఉన్న ఫోన్ బుక్ ఆధారంగానే ఈ తేనెతుట్టెను కదిపారు దర్యాప్తు అధికారులు. ఫోన్ బుక్ లో ఉన్న పేర్లతో పాటు.. కాల్ డేటా.. వాట్సాప్ సంభాషణలను కూడా సిట్ వదిలిపెట్టలేదు. డ్రగ్స్ సరఫరా చేసిన వారితో సంభాషణలు జరిపిన వారిని నోటీసులు పంపి విచారించనున్నారు. ఎల్ ఎస్డీ.. కొకైన్ వంటి మత్తు పదార్ధాలను ఆయా వ్యక్తులకు ఈ సప్లైదారులు కొన్ని సార్లు నేరుగానే అందించారని విచారణలో వెల్లడైనట్లు చెబుతున్నారు.

కొన్ని సార్లు సెలబ్రిటీల పీఏలకు.. డ్రైవర్లకు.. వారు పంపిన వ్యక్తులకు డ్రగ్స్ ని సరఫరా చేసేవారని ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 12 మందికి నోటీసులు పంపామనే విషయాన్ని ఇన్వెస్టిగేషన్ టీం ధృవీకరించగా.. ఈ 12 మంది ఈ నెల 19- 27ల మధ్య విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.
Tags:    

Similar News