పెళ్లి గురించి అడిగితే.. బ్రేకప్ గురించి చెప్పుకొచ్చింది

Update: 2022-11-18 00:42 GMT
గతంలో మాదిరి వ్యక్తిగత విషయాల్ని సందర్భానికి తగ్గట్లు షేర్ చేసేందుకు వెనుకాడటం లేదు హీరోయిన్లు. ఒకప్పుడు గుండెలు పగిలిపోయే ఉదంతాలు జీవితంలో చోటు చేసుకున్నా.. కెమేరా ముందు ఎలా అయితే నటిస్తారో.. నిజ జీవితానికి సంబంధించిన విషయాల్ని షేర్ చేసుకోవటానికి అస్సలు ఇష్టపడేవారు కాదు.

గతంలో పోలిస్తే వర్తమానంలో కాస్తంత మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. మీడియాకు బదులుగా సోషల్ మీడియా మరింత యాక్టివ్ కావటం.. ఫాలోవర్ల బేస్ పెంచుకోవటానికి.. అక్కడెక్కడో ఉండే తారలు.. తమతోనే నేరుగా మాట్లాడతారన్న ఊహ ఎక్సైటింగ్ గా మారిన నేపథ్యంలో.. ఫాలోవర్ల ఆసక్తి పెరుగుతోంది.

తాము ఎంత యాక్టివ్ గా ఉంటే.. అంత బేస్ పెరిగే అవకాశం ఉండటంతో.. సోషల్ మీడియాలో మరింతగా దూసుకెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు తారలు. ఈ క్రమంలో అప్పుడప్పుడు లైవ్ లోకి రావటం.. అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం.. ఈ క్రమంలో నిజాయితీగా ఉంటూ.. తమకు సంబంధించిన విషయాల్ని షేర్ చేసుకుంటున్న వైనంతో చాలామంది అభిమానులకు మరింత దగ్గరగా ఉన్నారు. తాజాగా హీరోయిన్ సునైనా సోషల్ మీడియా లైవ్ లో చేసిన వేళ.. ఆమెకు సంబంధించిన ఒక వ్యక్తిగత విషయం బయటకు వచ్చింది.

ఇంతకీ సునైనా ఎవరంటారా? అదేనండి.. రాజరాజ చోర మూవీలో తన నటనతో మంచి మార్కులు వేయించుకుందే.. ఆ బ్యూటీనే. తెలుగుతో పాటు తమిళం.. మలయాళం.. కన్నడ భాషల్లో నటిస్తున్న ఆమె.. తాజాగా సోని లివ్ లో  ఆమె చేసిన వండర్ ఉమెన్ ఈ రోజు (శుక్రవారం) నుంచి టెలికాస్ట్ కానుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అన్నట్లుగా ఆమె సోషల్ మీడియాలో చాట్ చేశారు. ఈ సందర్భంగా ఒక అభిమాని ఆమె పెళ్లి ప్రస్తావన తెచ్చారు.

మీ పెళ్లి ఎప్పుడు? అని అడగ్గా.. ఎవరూ ఊహించని సమాధానం ఇచ్చి అందరూ తనవైపు చూసేలా చేశారు. 'ముందు బ్రేకప్ గాయం తగ్గనీ' అని చెప్పటంతో పాటు.. తాను ఇంకా ఆ బాధ నుంచి బయటకు రాలేదన్నారు. కష్ట సమయాల్లో ఏం చేస్తారని మరొకరు ప్రశ్నించగా.. ఈ మధ్యనే తాను చదవటం మొదలుపెట్టానని.. పుస్తకాలు చదవటం వల్ల ఎంతో సాంత్వన ఉంటుందని చెప్పింది. మొత్తానికి పెళ్లి ఎప్పుడంటే.. బ్రేకప్ గాయం గురించి ఓపెన్ అయిన వైనం ఆసక్తిని రేకెత్తించేలా మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News