సోషల్ మీడియా వచ్చాక ప్రైవసీ అన్నదే లేకుండా పోయింది. ప్రచారంలో హద్దులు చెరిపేశారు. ఎవరిని ఏం అడగాలో.. అడగ కూడదో కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. తోచింది ఏదో ఒకటి అడిగేస్తున్నారు. ఫలితంగా అది పెద్ద రచ్చకు దారి తీస్తోంది. ఇలాంటి సంఘటనే గోవా బ్యూటీ ఇలియానాకు ఎదురైంది. టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన ఇలియానా ఆ తరువాత బాలీవుడ్ పై మోజు పెంచుకుని అక్కడికి చెక్కేసిన సంగతి తెలిసిందే. అయినా అక్కడ పెద్దగా అవకాశాల్ని అందుకోలేకపోయింది. కానీ బాయ్ ఫ్రెండ్‌తో మాత్రం పీకల్లోతు ప్రేమలో మునిగి కెరీర్‌ని పక్కదారి పట్టించింది.
`రైడ్` తరువాత ఇలియానా చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదంటే బాలీవుడ్ లో ఇలియానా పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. ఎక్కువగా ఖాళీగా ఉంటున్న ఇలియానా సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్‌గా వుంటూ నెటిజన్లకు అందుబాటులో వుంటోంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ పేజీలో ఆస్క్ మీ ఎనీథింగ్ అని అభిమానులతో చాటింగ్ చేయడం మొదలుపెట్టింది. ఇదే ఇలియానాను ఇబ్బందుల్లో పడేసింది.
అభిమానుల తన తరువాత చిత్రం గురించి అడిగితే ఓ నెటిజన్ మాత్రం ఇలియానా కన్యత్వం గురించి ప్రశ్నించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. `మీరు మీ కన్యత్వాన్ని ఎప్పుడు కోల్పోయారు?` అంటూ అడగడంతో `ఈ విషయంలో మీ అమ్మ ఏం చెబుతుందో ముందు అడిగి తెలుసుకో` అంటూ ఇలియానా నెటిజన్‌కి దిమ్మదిరిగే స్ట్రోక్ ఇచ్చేసింది.