క్వీన్ కంగన రనౌత్- రంగోలి సిస్టర్స్ నోటి దురుసు గురించి నెటిజనుల్లో బోలెడంత చర్చ సాగుతుంటుంది. ప్రతిసారీ ఏదో ఒక వివాదంతో ఈ అక్కాజెల్లెళ్లు మీడియా హెడ్ లైన్స్ లోకి వస్తూనే ఉన్నారు. ఒకానొక సందర్భంలో మలైకా అరోరాపై కంగన సోదరి రంగోలి చేసిన కామెంట్ పెనుదుమారం రేపింది. సోషల్ మీడియాల్లో దీనిపై పెద్ద చర్చ కొనసాగింది.
వాస్తవానికి కంగనా రనౌత్ నిరంతరం బోల్డ్ స్టేట్ మెంట్లు ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటుంది. శత్రువర్గాన్ని చీల్చి చెండాడడంలో ఏనాడూ వెనకాడలేదు. బాలీవుడ్ లో ఏం జరిగినా కంగన తన మనసులో మాటను బయటకు చెప్పడానికి భయపడదు.. వెనుకాడదు. ఆమె సోదరి రంగోలి చందేల్ కూడా బాలీవుడ్ సెలబ్రిటీలను ఎగతాళి చేయడం కొత్త కాదు. రంగోలి ఒకసారి ఫ్యాషనిస్టా మలైకా అరోరాను కూడా ఎగతాళి చేసింది.
తన కొడుకు అర్హాన్ తో కలిసి బెడ్ రూమ్ లో మలైకా అరోరా అచేతనంగా ఫోజులిచ్చిన ఓ ఫోటోని అప్పట్లో రంగోలి షేర్ చేసింది. అయితే ఆ ఫోటోలో మలైకా తన కొడుకు ముందే డీప్ నెక్ లైన్ ని ప్రదర్శించినందుకు రంగోలి విరుచుకుపడింది. ``ఇది ఆధునిక భారతీయ తల్లి…`` అంటూ విమర్శలు గుప్పించింది. మలైకా అలాంటి స్థితిలో ఉన్న ఫోటోని షేర్ చేయడాన్ని రంగోలి ఆమోదించలేదు. ఆమెపై విరుచుకుపడుతూ తన ట్విట్టర్ ఖాతాలో ఆ ఫోటోని షేర్ చేసింది.
2019లో జరిగిన ఈ ఘటనను ఇప్పటికీ అభిమానులు మరువలేదు. మలైకా తన కొడుకు అర్హాన్ ఖాన్ తో కలిసి కెమెరా లెన్స్ లోకి చూస్తున్నప్పుడు నైట్ గౌన్ లో ఉన్న ఫోటోని అనాలోచితంగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోను షేర్ చేసి ``కొడుకు మంచిగా ఉన్నప్పుడు... మమ్మీని జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు`` అని క్యాప్షన్ కూడా ఇచ్చింది.
అయితే రంగోలి చందేల్ మలైకా అరోరా ఫోటోపై విరుచుకుపడింది. తీవ్ర విమర్శలు గుప్పించింది. దానిని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. అర్బాజ్ ఖాన్ మాజీ భార్య అయిన మలైకాపై విరుచుకుపడుతూ ``ఇదీ ఆధునిక భారతీయ తల్లి.. చాలా బాగుంది`` అని పంచ్ లు విసిరింది. చప్పట్లు కొడుతున్న ఈమోజీలను అలానే..థంబ్స్-అప్ ఈమోజీలను కూడా షేర్ చేసింది.
అయితే కంగనా రనౌత్ సోదరి రంగోలి పోస్ట్ ను నెటిజనులు పెద్దగా మెచ్చుకోలేదు. మలైకాపై అవమానకరమైన కామెంట్ చేసినందుకు తనను తీవ్రంగా నిందించారు. ఒక ట్విట్టర్ వినియోగదారు వ్యాఖ్యానిస్తూ..``రంగోలీకి ఆధునికత తెలీదు.. ప్రతి రోజు ఇలా ఎగిరిపడిపోతుంది`` అని కామెంట్ చేసారు.
వరుసగా నెటిజనుల నుంచి ప్రతికూల కామెంట్లు వెల్లువెత్తడంతో రంగోలీ చందేల్ కాస్త వెనక్కి తగ్గింది. తన స్టాండ్ ఏమిటన్నది కూడా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ``మలైకా గురించి చాలా నీచమైన విషయాలు రాస్తున్నారు..`` అంటూ తెలివిగా ప్లేట్ ఫిరాయించింది. ``నేను ఆమెను ఆధునిక మమ్మీ అని పిలుస్తున్నాను.. అయితే ప్రజలు ఆమె గురించి చెప్పే అసహ్యకరమైన విషయాలన్నీ ఈ ఫోటోలో కనిపించడం చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. మీరంతా దయచేసి తప్పుగా మాట్లాడడం మానుకోండి. పైగా ఊహల్లో ఉండటం మంచిది కాదు`` అంటూ కవరింగ్ ఇచ్చింది రంగోలి.
అంతేకాదు.. రంగోలి తన తల్లి వీడియోను మైక్రో బ్లాగింగ్ సైట్ లో షేర్ చేసింది. అక్కడ వృద్ధురాలు అయిన తన తల్లి మనవడు పృథ్వీ (రంగోలి కొడుకు) కి స్వెటర్ అల్లుతూ కనిపించింది. ఈ ఫోటోని షేర్ చేస్తూ తన తల్లిగారిని రంగోలి ఆకాశానికెత్తేసింది ``అసలైన భారతీయ తల్లుల తరంలో చివరి మమ్మీ`` అని ఆ ఫోటోకి ఆసక్తికర వ్యాఖ్యను జోడించింది. ఆమె స్వరంలో ఇటీవలి కాలంలో మమ్మీలు అంత సరిగా లేరనే వ్యంగ్యం ధ్వనించింది. ముఖ్యంగా మలైకా వైపు వేలెత్తి చూపించేలా ఈ పంచ్ ని గురి చూసి విసిరింది రంగోలి.
క్రిష్ 3 రిలీజ్ సమయంలో హృతిక్ రోషన్ తో కంగన వార్ గురించి తెలిసిందే. ఆ టైమ్ లో రంగోలి చందేల్ నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లో నిలిచేది. తన సోదరిని డిపెండ్ చేస్తూ రోషన్ లపై నిరంతరం విరుచుకుపడేది. ఇండస్ట్రీ మాఫియా పైనా కంగనతో కలిసి రంగోలి నిరంతరం కౌంటర్లు వేస్తూనే ఉంటుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.