ప్రియాంకకు మీడియా ముందే ముద్దు

Update: 2017-05-15 04:38 GMT
ప్రియాంక చోప్రా హాలీవుడ్ అరంగేట్రం మరికొన్ని రోజుల్లోకి వచ్చేసింది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లిపోయి ఇప్పటికే తెగ హల్ చల్ చేస్తున్న ఈ సుందరాంగి.. టీవీ షోలు.. ఫోటో షూట్స్.. మేగజైన్స్ కవర్ పేజ్ షూట్స్ తో మహా బిజీగా ఉంది. మరోవైపు బేవాచ్ మూవీలో కీలకమైన రోల్ ను ఇప్పటికే పూర్తి చేసేయగా.. ఇప్పుడీ సినిమా రిలీజ్ కి కూడా రెడీ అయిపోయింది.

ప్రపంచవ్యాప్తంగా మే 25న యాక్షన్ మూవీ బేవాచ్ విడుదల కానుంది. రీసెంట్ గా ఈ మూవీకి ఫస్ట్ ప్రీమియర్ ను ప్రదర్శించారు. మియామిలో జరిగిన ఈ వరల్డ్ ప్రీమియర్ కు పలువురు హాలీవుడ్ ప్రముఖులతో మొత్తం మూవీ యూనిట్ అంతా హాజరైంది. ఫిలిం ఫస్ట్ ప్రీమియర్ ను తెగ ఎంజాయ్ చేస్తూ చూశారు బేవాచ్ టీం. సినిమా అయిపోయిన తర్వాత.. డ్వేన్ జాన్సన్ తో పాటు ప్రధాన నటులైన ప్రియాంక చోప్రా.. జాక్ ఎఫ్రాన్, ఎలెగ్జాండ్రా దద్దారియో, కెల్లీ రోబాచ్ లు మీడియాతో కాసేపు ముచ్చట్లు చెప్పారు.

అయితే.. మూవీలో ప్రియాంక యాక్టింగ్ పై తెగ ప్రశంసలు గుప్పించిన డ్వేన్ జాన్సన్.. ఆమె మీడియాతో మాట్లాడుతున్నపుడు సడెన్ గా వచ్చి వెనకనుంచి రెండు చేతులు పట్టుకుని బుగ్గపై ఘాటు ముద్దు ఇచ్చేశాడు. ఈ ఇన్సిడెంట్ ను పీసీ కూడా బాగానే ఎంజాయ్ చేసింది. ఈ సడెన్ కిస్సింగ్ సీన్.. మూవీకి బోలెడంత ప్రమోషన్స్ తెచ్చిపెట్టేస్తోంది.
Tags:    

Similar News