'అఖండ'తో తొలి కమర్శియల్ సక్సెస్ ని ఖాతాలో వేసుకుంది ముంబై బ్యూటీ ప్రగ్యాజైశ్వాల్. ఇప్పటివరకూ అమ్మడు ఏడెనిమిది సినిమాల్లో నటించింది. కానీ సిసలైన కమర్శియల్ సక్సెస్ మాత్రం 'అఖండ'తోనే దక్కింది. తొలి సినిమా' మిర్చిలాంటి కుర్రాడు' తో ఎంట్రీ ఇచ్చింది అటుపై 'కంచె'తో నటిగా ప్రూవ్ చేసుకున్నా ప్రగ్యా కెరీర్ స్పీడప్ కాలేదు. ఆ తర్వాత నటించిన సినిమాలు ప్ర్యగ్యా కెరీర్ ని వెనక్కి లాగిపెట్టాయి తప్ప ముందుకు తీసుకెళ్లలేదు. దీంతో రెండేళ్లు గ్యాప్ తప్పలేదు.
అనంతరం 'అఖండ'లో ఛాన్స్ దక్కించుకుని బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇందులో బ్యూటీ పాత్ర..ఆహార్యం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బాలయ్య లాంటి సీనియర్ హీరోలకు పర్పెక్ట్ జోడీగాను మ్యాచ్ అవుతుందని క్లారిటీ వచ్చింది. హిట్ వచ్చింది కాబట్టి బిజీ అవుతుందని అంచనాలున్నాయి. చిరంజీవి..నాగార్జున..వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలకు హీరోయిన్లను ఎంపిక చేయడం దర్శకులకు ఇబ్బందిగా మారుతోన్న సంగతి తెలిసిందే.
ఆ రకంగా ఇలాంటి హీరోలకు ప్రగ్యా పర్పెక్ట్ ఛాయిస్ అని టాక్ వినిపించింది. ఇదే అదనుకగా పారితోషికం కూడా పెంచేసిందని ప్రచారం సాగింది. 'అఖండ'కి 30 లక్షలు అందుకున్న భామ ఇప్పుడే అదే పరితోషికం 60 లక్షలు చేసిందని గుస గుస వినిపించింది. కానీ తాజా అప్ డేట్ ని బట్టి ప్రగ్యా కెరీర్ ఇంకా నత్తనడకనే సాగుతున్నట్లు కనిపిస్తుంది.
'అఖండ' తర్వాత మోహన్ బాబు నటించిన 'సన్నాఫ్ ఇండియా'లో నటించింది. కానీ ఈ సినిమా ఫలితం నిరాశలపరిచింది. అప్పటి నుంచి ప్రగ్యాకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. తెలుగులో అయితే ఎలాంటి కమిట్ మెంట్లు కనిపించలేదు. ఇక బాలీవుడ్ లో అయితే తీరని అన్యాయమే జరిగిందని చెప్పాలి.
సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా తెరకెక్కిన 'యాంటమ్ ది ఫైనల్ ట్రూత్' ముందుగా హీరోయిన్ గా ప్రగ్యానే ఎంపిక చేసుకున్నారు. ప్రగ్యాజైశ్వాల్-సల్మాన్ పై ఓ రొమాంటిక్ సాంగ్ కూడా షూట్ చేసారు. కానీ ఉన్నట్లుండి ఆ సినిమా నుంచి ప్రగ్యాని తొలగించి వేరే హీరోయిన్ ని పెట్టుకున్నారు. అలా హిందీ పరిశ్రమలో భంగపాటు తప్పలేదు. ఈ సంఘటన ప్రగ్యా బాలీవుడ్ కెరీర్ పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.
ఆమె ఏదో తప్పు చేసి తప్పించినట్లు మీడియాలో కథనాలు రావడంతో అవకాశాలు ఇవ్వాలి అనుకున్న వాళ్లు కూడా వెనక్కి తగ్గుతున్నారు. ఆరకంగా హిందీలోనూ అమ్మడు సక్సెస్ కాలేకపోతుంది. అయితే ఇప్పటికే 'టిటూ ఎంబీఏ' చిత్రంతో అక్కడ లాంచ్ అయింది. కానీ ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. కొత్త అవకాశాలు లేకపోవడంతో ఈ ఏడాది ఓ పాప్ వీడియో సాంగ్ లో నటించింది. మరి హీరోయిన్ గా ఈ ఏడాది ఏదైనా కొత్త సినిమాతో అలరిస్తుందా? లేదా? అన్నది చూడాలి.