టాలీవుడ్ తెరకి నిధి అగర్వాల్ .. నభా నటేశ్ ఒకే సమయంలో పరిచయమయ్యారు. నిధి చక్కని కనుముక్కుతీరుతో ఆకట్టుకుంది. 'సవ్యసాచి'లో నిధిని చూసినవాళ్లంతా ఈ మధ్య కాలంలో ఇలాంటి పిల్ల ఇండస్ట్రీకి రాలేదని అనుకున్నారు. దొండపండులాంటి ఈ పిల్లకి ఢోకా లేదని చెప్పుకున్నారు. ఆ తరువాత చేసిన 'మిస్టర్ మజ్ను' సినిమా కూడా సరిగ్గా ఆడలేదు. అయినా ఏకంగా పూరి సినిమాలోనే ఛాన్స్ కొట్టేసింది. ఇక మరో వైపున 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన నభా కూడా అటు ఇటు తిరిగి 'ఇస్మార్ట్ శంకర్' ప్రాజెక్టులోకి వచ్చింది.
నిధి చూస్తేనేమో సన్నజాజి కి కాస్త ఇటుగా .. సంపెంగకి కాస్త అటుగా అనిపిస్తుంది. ఇక నభా విషయానికి వస్తే చామంతికి .. ముద్దబంతికి అటు ఇటుగా కనిపిస్తుంది. ఇద్దరూ ఈ సినిమాలో అందాలు ఆరబోయడానికి వెనుకాడలేదు .. మొహమాటపడలేదు.
ఈ సినిమాలోని మాస్ సాంగ్స్ లో ఈ ఇద్దరూ కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ ను నమోదు చేయడంతో , ఇక ఈ భామలను పట్టుకోవడం కష్టమే అనుకున్నారు. అవకాశాలన్నీ ఈ అందాల భామల చుట్టూనే ప్రదక్షిణం చేస్తాయని భావించారు.
అయితే ఈ ఇద్దరి భామల్లో నిధి అంత స్పీడ్ చూపించలేదు. కోలీవుడ్ వైపు చూస్తూనే తెలుగులో 'హీరో' అనే ఒక సినిమా చేసింది. ఒక వైపున పవన్ కల్యాణ్ తో చేస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమా సెట్స్ పై ఉండగానే ఆమె ఒక కొత్త హీరోతో సినిమా చేయడం ఆమెకే చెల్లింది. ఆ సినిమా ఆమె కెరియర్ కి ఏమైనా హెల్ప్ అయిందా అంటే అదీ లేదు. పోనీ ఈ సినిమా తరువాతైనా మిగతా ప్రాజెక్టులు ఏమైనా లైన్లో పెట్టిందా అంటే అదీ లేదు. ఇంత అందం పెట్టుకుని ఇంటి పట్టున కూర్చోవడం కూడా ఆమెకే చెల్లింది.
ఇక నభా విషయానికి వస్తే .. అవకాశాలను ఎంత ఫాస్టుగా అందుకోవచ్చునో చూపించింది. 'డిస్కోరాజా' .. 'సోలో బ్రతుకే సో బెటర్' .. 'అల్లుడు అదుర్స్' .. 'మాస్ట్రో' సినిమాలను చకచకా చేసేస్తూ వెళ్లింది. అయితే ఈ సినిమాలన్నీ ఒక దాని తరువాత ఒకటిగా వచ్చాయి.. పోయాయి.
సక్సెస్ లు మాత్రం ఎక్కడో ఏదో తట్టుకుని ఆగిపోయాయి. ఆ తరువాత నుంచి నభాకి కూడా అవకాశాలు లేవు. నిదానమే ప్రధానమన్నట్టుగా ఉన్న నిధి పరిస్థితి .. ఆలస్యం అమృతం విషం అన్నట్టుగా దూకుడుగా వెళ్లిన నభా పరిస్థితి ఒకేలా ఉంది. అందుకే అంటారు.. కొత్త కథానాయికలు వచ్చేలోగా కొంతైనా వెనకేసుకోవాలని!