వేర్ ఈజ్ నారప్ప డైరెక్టర్..?

Update: 2022-01-13 09:30 GMT
సున్నితమైన కథలను తెర మీదకు తీసుకొస్తూ సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు శ్రీకాంత్ అడ్డాల. 'కొత్త బంగారు లోకం' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై.. ఫస్ట్ మూవీతోనే సక్సెస్ రుచి చూశారు. ఈ క్రమంలో మహేష్ బాబు - వెంకటేష్ వంటి ఇద్దరు స్టార్ హీరోల కాంబినేషన్ లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె' వంటి మల్టీస్టారర్ తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఒక విధంగా ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ మల్టీస్టారర్స్ కు బీజం వేసింది శ్రీకాంత్ అడ్డాలే అని అనుకోవచ్చు.

అయితే 'సీతమ్మ..' తర్వాత శ్రీకాంత్ దర్శకత్వం వహించిన రెండు సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి. వరుణ్ తేజ్ లాంచింగ్ మూవీ 'ముకుంద'.. మహేష్ బాబుతో చేసిన రెండో సినిమా 'బ్రహ్మోత్సవం' బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో దర్శకుడికి ఏకంగా నాలుగేళ్ళ గ్యాప్ వచ్చింది. గతేడాది లాక్ డౌన్ టైంలో వెంకటేష్ తో కలసి 'నారప్ప' సినిమాతో వచ్చారు. తనశైలికి పూర్తి భిన్నంగా రీమేక్ సినిమాతో ఓటీటీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు.

సక్సెస్ జోష్ లో శ్రీకాంత్ అడ్డాల వెంటనే మరో సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్తారని అందరూ భావించారు. అయితే ఇంతవరకు తదుపరి సినిమా గురించి అధికారిక ప్రకటన రాలేదు. కాకపోతే 'నారప్ప' మూవీ ప్రమోషన్స్ సమయంలో ''అన్నాయ్'' అనే సినిమా చేయనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. అది గుంటూరు బ్యాక్ డ్రాప్ లో రూపొందే భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా అని.. అది కూడా మూడు భాగాలుగా తెరకెక్కే ట్రైయాలజీ అని పేర్కొన్నారు.

ఇప్పుడున్న మార్కెట్ కి 'అన్నాయ్' కథ కుదురుతుందని.. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని తెలిపారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా ఉంటుంది అడ్డాల శ్రీకాంత్ వెల్లడించారు. అయితే ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి సౌండింగ్ లేదు. అయితే ఈ సినిమాని వర్సటైల్ హీరో శర్వానంద్ తో చేయాలని శ్రీకాంత్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు దర్శకుడు శర్వా డేట్స్ కోసం చూస్తున్నాడా లేదా మరో హీరో కోసం ట్రై చేస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే దీనిపై స్పష్టత ఇచ్చి, సెట్స్ మీదకు తీసుకెళ్తారేమో చూడాలి.
Tags:    

Similar News