సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ''లైగర్''. 'సాలా క్రాస్ బ్రీడ్' అనేది దీనికి ట్యాగ్ లైన్. మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. పాండమిక్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవల తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం గోవాలో బాక్సింగ్ ఛాంపియన్ షిప్ కు సంబంధించిన కీలకమైన సీన్స్ షూట్ చేస్తున్నారు. అయితే 'లైగర్' చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయం మీద మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.
నిజానికి 'లైగర్' చిత్రాన్ని వినాయక సందర్భంగా సెప్టెంబర్ 9న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చి ప్లాన్స్ అన్నీ తారుమారు చేసింది. ఇప్పుడు కరోనా కారణంగా వాయిదా పడిన పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అన్నీ విడుదల తేదీలను ప్రకటిస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 22 నుండి థియేటర్లు తెరవడానికి అనుమతించిన నేపథ్యంలో వరుస పెట్టి డేట్స్ లాక్ చేసి పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఫస్ట్ పాన్ ఇండియా మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
'లైగర్' చిత్రంలో లెజెండరీ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ అతిధి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే మైక్ టైసన్ తో షూటింగ్ చేయడానికి చిత్ర యూనిట్ లో యూఎస్ఏ లో షెడ్యూల్ ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో టీమ్ అంతా యూఎస్ వీసాల ఆమోదం కోసం వేచి ఉన్నారని టాక్ వినిపిస్తోంది. వీసాలను ఆమోదించిన తర్వాత పరిస్థితులను బట్టి 'లైగర్' రిలీజ్ డేట్ ని లాక్ చేసుకోవాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా వీడీ - పూరీ సినిమా వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతోందని అర్థం అయింది. మరి దీని కోసం ఏ తేదీని ఫైనలైజ్ చేస్తారో చూడాలి.
కాగా, 'లైగర్' చిత్రాన్ని పూరి కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాధ్ - ఛార్మి కౌర్ - కరణ్ జోహార్ మరియు అపూర్వ మెహతా కలసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. రమ్యకృష్ణ - రోనీత్ రాయ్ - ఆలీ - విషు రెడ్డి - మకరంద్ దేశ్ పాండే - గెటప్ శీను తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. విష్ణు శర్మ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. జునైద్ సిద్దిఖీ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు డిజైన్ చేస్తున్నారు.