బుల్లితెర యాంకర్ గా పాపులారిటీని సొంతం చేసుకున్న అనసూయ అదే క్రేజ్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బుల్లితెరపై యాంకర్ గా తన సత్తా చాటుతూనే సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ తనదైన పంథాలో రాణిస్తోంది. అప్పుడప్పడు రంగమ్మత్త (రంగస్థలం), దాక్షాయని (పుష్ప) లాంటి పాత్రల్లో నటిస్తూ తనదైన పాత్రలతో నటిగానూ మంచి పేరు తెచ్చుకుంటోంది. అయితే రెండు పడవల ప్రయాణాన్ని సాఫీగా సాగిస్తూ పాపులర్ అవుతున్న అనసూయ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.
మహిళా సాధికరాత, మహిళలని కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా.. సినిమాల్లో అలాంటి డైలాగ్స్ వున్నా సరే వారిపై నెట్టింట ఘాటుగా స్పందిస్తూ తన నిరసనని తెలియజేస్తూ వుంటోంది. తనని విమర్శించే వారిని కూడా టార్గెట్ చేస్తూ పదునైన ట్వీట్ లతో ట్రోల్ చేస్తూ వుంటుంది. ఇటీవల బిల్కినో బానో పై అత్యాచారం చేసిన 11 మంది ఖైదీలని గుజరాత్ ప్రభుత్వం ఆగస్టు 15న సత్ ప్రవర్తన కింది క్షమాభిక్ష పేరుతో విడుదల చేయడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఘండిస్తూ ట్వీట్ చేస్తే ఆ ట్వీట్ ని రీట్వీట్ చేస్తూ ఘాటుగా స్పందించి వార్తల్లో నిలిచింది.
అయితే గురువారం అనసూయ పెట్టిన ట్వీట్ ఇప్పడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. 'అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా!! అంటూ #NotHappyOnsomeonesSadness but #FaithRestored అనే హ్యాష్ ట్యాగ్ లని జత చేసిన పోస్ట్ ఇప్పడు నెట్టింట ట్రెండ్ అవుతూ సరికొత్త చర్చకు తెరలేపుతోంది. అయితే అనసూయ వేసిన ట్వీట్ ఎవరి మీద? .. ఎవరిని ఉద్దేశించి రంగమ్మత్త ఈ పంచ్ వేసింది? అన్నది ఇప్పడు సోషల్ మీడియాలో డిబేట్ మొదలైంది.
కొంత మంది తన ట్వీట్ ఉద్దేశం అర్థం అయినట్టుగా తనకు సపోర్ట్ చేస్తూ 'చరిత్రే చెబుతోంది కదా మేడం!! ఆడబిడ్డల జోలికి వస్తే పెద్ద పెద్ద సామ్రాజ్యాలే కూలిపోయాయ్!! మనమెంత!!' అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. కొంత మందేమో ఎవరిని అంటున్నావో అర్థం కాలేదు..దేనికి అంటున్నవో కొంచెం క్లారిటీ ఇవ్వు అత్త' అని కామెంట్ చేస్తున్నారు. మరి కొంత మంది మాత్రం ఖచ్చితంగా ఈ ట్విట్ 'లైగర్' రిజల్ట్ ని ఉద్దేశించే అని ట్విట్ లు చేస్తున్నారు.
మరి కొంత మంది మాత్రం 'అర్జున్ రెడ్డి' సినిమా సమయంలో అమ్మ అనే పదాలకు వ్యతిరేకంగా పలు టీవీ డిబేట్ లలో పాల్గొన్న అనసూయ డైరెక్ట్ గా విజయ్ దేవరకొండపై ఘాటు విమర్శలు చేసి వార్తల్లో నిలిచింది. అయితే విజయ్ దేవరకొండ మాత్రం ఇదంతా పబ్లిసిటీని గేయిన్ చేయడం కోసం చేస్తున్న స్టంట్ అంటూ అనసూయని కామెంట్ చేశాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తూనే వుంది. తాజాగా 'లైగర్' తో అది మళ్లీ బయటపడిందని నెటిజన్స్ బాహాటంగానే కామెంట్ లు చేస్తున్నారు.
అనసూయ మాత్రం పేరు పెట్టకుండా కామెంట్ చేసింది. 'అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా!!' అంటూ చేసిన కామెంట్ 'లైగర్' ఫ్లాపయిందనా? లేక తన ఉద్దేశ్యం మరేదైనా వుందా? అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ కొంత మంది నెటజన్ లు అనసూయకు సపోర్ట్ చేస్తుంటే మరి కొంత మంది మాత్రం మరి 'మీకు మాత్రమే చెప్తా' సినిమాలో ఎందుకు నటించావ్ అని ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా 'నువ్వు ఎవరిని అన్నవో వాళ్ళ ఉసురు నీకు తగులుతది అనసూయ.. నీకు కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా!!' అని ట్రోల్ చేస్తున్నారు.