మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) వ్యవస్థాపక అధ్యక్షుడిగా మెగాస్టార్ చిరంజీవి పనిచేశారు. ఆ తర్వాత నాగబాబు - మురళీ మోహన్ వంటి ప్రముఖులు మా అధ్యక్షులుగా పదవి అలంకరించారు. మురళీ మోహన్ పదవీవిరమణ చేసిన తరువాత రాజేంద్ర ప్రసాద్- శివాజీ రాజా కూడా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా పనిచేశారు. ఆ తర్వాత సీనియర్ నరేష్ అధ్యక్ష పదవిని చేపట్టారు. 2019 నుంచి మాలో గొడవలు బయటపడడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దాదాపు 800 మంది సభ్యులతో దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద అసోసియేషన్ ఇది.
శివాజీ రాజా వర్సెస్ నరేష్ ఎపిసోడ్స్ రచ్చకెక్కడం .. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడంతో మా అసోసియేషన్ ప్రతిష్ఠకు భంగం వాటిల్లిందని సినీపెద్దలు భావించారు. 2021-22 సీజన్ కి కొత్త అధ్యక్షుడి ఎంపిక ఇప్పటికే ఆలస్యమైంది. ఎట్టకేలకు మా ఎన్నికల వేడి ఊపందుకుంది. ఈసారి ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పటికే ప్రకటించారు. ఆయన ప్రచారంలో దూసుకుపోతుండగా.. ఇప్పుడు మంచు విష్ణు కూడా ఈ పదవి కోసం పోటీపడుతూ వార్ లోకి వచ్చారు. మంచు విష్ణు - మోహన్ బాబు బృందాలు తాజాగా తమకు మద్ధతు కోరుతూ సూపర్ స్టార్ కృష్ణను కలిసారు. ఇక ఈ బృందానికి ప్రస్తుత అధ్యక్షుడు.. సీనియర్ నరేష్ పూర్తి మద్ధతునిస్తున్నారు.
అయితే ఎవరు ఎవరికి మద్ధతునిచ్చినా కానీ.. అంతిమంగా మెగా కాంపౌండ్ మద్ధతు లభించిన వారికే అధ్యక్ష పదవి దక్కుతుందనేది అందరికీ తెలిసిన వాస్తవం. అయితే మెగాస్టార్ చిరంజీవి ఎవరికి సపోర్టుగా నిలవనున్నారు? ఆయన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కి మద్ధతునిస్తారా? చిరంజీవి- నాగబాబు వర్గాలు ఎవరిని అధ్యక్షుడు కావాలని కోరుకుంటున్నారు? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. ప్రకాష్ రాజ్ ఆశలన్నీ మెగాస్టార్ పైనే. మరి ఆయన ఎవరికి మద్ధతిస్తున్నారు? అన్నది సస్పెన్స్ గా మారింది. ఆసక్తికరంగా క్రమశిక్షణా కమిటీ పెద్దలుగా ఉన్న చిరంజీవి .. మోహన్ బాబు చెరో వైపు నిలుస్తారా? కలిసి కట్టుగా ఒకరికే మద్ధతిస్తారా? అన్నది వేచి చూడాలి.