ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతోంది. అదే క్రమంలో మల్టీస్టారర్ల ట్రెండ్ కూడా ఊపందుకుంది. విభిన్న భాషల నుంచి అగ్ర హీరోలు కలిసి నటిస్తే దక్కే రిజల్ట్ వేరుగా ఉంటోంది. ఇక సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించే ప్రతి సినిమా పాన్ ఇండియా కేటగిరీలోనే విడుదలవుతాయన్న సంగతి తెలిసిందే. రజనీతో పాటు అగ్ర హీరోలు నటించేందుకు ఆసక్తిగా ఉంటారు. అదే క్రమంలో రజనీతో కలిసి నటించే అవకాశం ఉంటే.. ఇటు తెలుగు స్టార్లు సిద్ధంగానే ఉన్నారు.
కానీ రజనీ నటిస్తున్న తాజా చిత్రంలో ఒక తమిళ అగ్ర హీరోనే తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఇరుగు పొరుగు భాషల నుంచి హీరోలకు ఏమాత్రం ఛాయిస్ లేదు. ఇక ఈ చిత్రానికి బీస్ట్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు.
అన్నాథే లాంటి యావరేజ్ తర్వాత రజనీ కొన్ని నెలలు విరామం తీసుకున్నాడు ఇటీవలే కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. తాత్కాలికంగా తలైవర్ 169 అని టైటిల్ ని ఫిక్స్ చేశారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ దీనికి సంగీతం సమకూరుస్తున్నారు.
ఇక బీస్ట్ చిత్రంపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నా ఆశించినది దక్కలేదు. దీనికి నెల్సన్ దిలీప్ కుమార్ బాధ్యత వహించాలంటూ దళపతి విజయ్ తండ్రిగారు ఆరోపించిన సంగతి తెలిసిందే. బీస్ట్ స్క్రీన్ ప్లే బాలేదంటూ ఆయన బహిరంగంగా విమర్శించారు. అయినా ఇప్పుడు అన్నిటికీ సమాధానంగా రజనీ సినిమాతో కంబ్యాక్ అయ్యి నెల్సన్ సత్తా చాటాల్సి ఉంటుంది.
రజనీ-శివ కార్తికేయన్ కాంబినేషన్ అంటే తమిళనాడులో భారీ అంచనాలుంటాయి. దానికి తగ్గట్టే కాన్సెప్టును కూడా నెల్సన్ ప్లాన్ చేస్తున్నారట. శివకార్తికేయన్ ఎంపికపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంటుంది. పాన్ ఇండియా మార్కెట్ నేపథ్యంలో అతడు ఇరుగు పొరుగు భాషల నుంచి స్టార్లను ఎంపిక చేసుకునే ఛాయిస్ ఉందేమో వేచి చూడాలి.