ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నా కోడలు నేను గర్వపడే పని చేసింది అంటూ అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన విషయం తెల్సిందే. మరోసారి ఉపాసన మెగా ఫ్యామిలీ మాత్రమే కాకుండా మెగా ఫ్యాన్స్ మొత్తం కూడా గర్వపడేలా ఘనత సాధించింది. కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో డాక్టర్స్‌కు థ్యాంక్స్ చెప్పే ఉద్దేశ్యంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ థ్యాంక్స్ హెల్త్ హీరోస్ ఛాలెంజ్ ను మొదలు పెట్టింది.
ఆ ఛాలెంజ్ పై స్పందించిన ఉపాసన కొనిదెల ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా ట్విట్టర్ లో.. తమ ప్రాణాలను లెక్క చేయకుండా తమ ఫ్యామిలీస్ ను కూడా వదిలి పెట్టి తమ ప్రాణాలను పనంగా పెట్టి ఈ సమయంలో సేవ చేస్తున్న వారికి సెల్యూట్ అంటూ ఒక వీడియోను ట్వీట్ చేసింది. ఉపాసన ట్వీట్ కు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ అధికారిక ట్విట్టర్ ఖాతాకు స్పందించింది.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ డైరెక్టర్ జనరల్ అయిన టెడ్రోస్ అదోనమ్ ఉపాసన ట్వీట్ కు సమాధానంగా... థ్యాంక్స్ హెల్త్ హీరోస్ ఛాలెంజ్ లో మీరు భాగస్వామి అయినందుకు కృతజ్ఞతలు. ఇండియా నుండి మీరు ఈ ఛాలెంజ్ ను స్వీకరించడం అభినందనీయం. నేను కూడా ఈ సమయంలో కోవిడ్ 19 పై పోరాటం చేస్తున్న డాక్టర్లు ఇంకా నర్స్ లకు కృతజ్ఞతలు చెబుతున్నారు. వారి ప్రాణాలను పనంగా పెట్టి వారు ఈ సమయంలో పని చేస్తున్నారంటూ ఆయన పేర్కొన్నారు. ఉపాసన ట్వీట్ కు డబ్ల్యూహెచ్ ఓ డైరెక్టర్ జనరల్ స్పందించడం అంటే చాలా గొప్ప విషయం అని.. ఇది మెగా ఫ్యాన్స్ అంతా గర్వించదగ్గ విషయం అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.