తారక్ కోసం ఎవరొస్తారు

Update: 2019-04-10 08:30 GMT
ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కు తాత్కాలిక బ్రేక్ పడ్డాక రాజమౌళి బయట కనిపించడం లేదు కాని రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు మాత్రం హైదరాబాద్ లోనే ఉన్నారు. ఇదిలా ఉండగా తారక్ సరసన సెట్ చేసిన డైసీ అర్దాంతరంగా తప్పుకోవడంతో ఇప్పుడా స్థానంలో ఎవరిని తీసుకురావాలి అనే దాని మీద టీం తీవ్ర చర్చల్లో ఉందట. సాహోతో పరిచయమవుతున్న శ్రద్ధా కపూర్ పరిశీలనలో ఉన్నట్టు టాక్ వచ్చింది.

సౌత్ లో సరైన ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న జాన్వీ కపూర్ ని తీసుకునే ఆలోచన ఉన్నట్టు గత రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే వీటిని నిర్ధారించడానికి ఏ సోర్స్ అందుబాటులో లేకపోవడంతో వీటికే రెక్కలు వస్తున్నాయి. చరణ్ కు అలియా భట్ సెట్ అయిపోయింది కాబట్టి ఆ విషయంలో టెన్షన్ లేదు. ఉన్నదల్లా జూనియర్ ఒక్కడికే

బాలీవుడ్ బ్యూటీలంతా బిజీగ ఉండటం మరో చిక్కు. పోనీ మన టాలీవుడ్ లో ఎవరినైనా తీసుకుందాం అంటే చరణ్ కేమో హిందీ సుందరి మాకేమో లోకల్ పాప అంటూ ఫ్యాన్స్ నెగటివ్ గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. అందుకే జక్కన్న చాలా సీరియస్ గా దీని మీద ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. ఒకవేళ శ్రద్ధా జాన్వీ ఇద్దరూ చేయలేని పరిస్థితి వస్తే అప్పుడు మరో సవాల్ మొదలువుతుంది.

టైం చాలా ఉన్నట్టు పైకి కనిపిస్తోంది కానీ వచ్చే ఏడాది జులై డెడ్ లైన్ ని మీట్ అవ్వాలి అంటే ఇలాంటి అవాంతరాలను వీలైనంత త్వరగా తొలగించుకోవాలి. ఇలాంటివి డీల్ చేయడంలో రాజమౌళ ఆరితేరాడు కానీ ఇప్పుడీ హీరోయిన్ సెలక్షన్ ని ఎలా ఫినిష్ చేస్తాడనేదే ఆసక్తికరంగా మారింది
Tags:    

Similar News