సన్ ఆఫ్ ఇండియాలో ఎవరిని టార్గెట్ చేశారు... ?

Update: 2021-10-06 02:30 GMT
ఇపుడు వస్తున్న సినిమాల్లో డైలాగులు భారీగా ఉంటున్నాయి. వర్తమాన రాజకీయ పరిస్థితుల మీద సినిమాలు తీస్తే మాత్రం కచ్చితంగా జనాల మద్దతు లభిస్తుంది. అదే సమయంలో కొన్ని వివాదాలు కూడా దానితో పాటే వెంట వస్తాయి. ఈ మధ్యనే రిలీజ్ అయిన హీరో  సాయి ధరమ్ తేజ్  రిపబ్లిక్ మూవీలో డైలాగుల మీద రాజకీయ వర్గాల్లో కూడా చర్చ సాగుతోంది. నిజానికి రాజకీయ వ్యవస్థ మీద సినిమాలు వస్తే ఎవరో ఒకరు భుజాలు తడుముకుంటారు. కానీ ఆ దెబ్బ అందరికీ తగులుతుంది. వారూ వీరు అని కాదు టోటల్ పాలిటిక్స్ నే ఏకిపారేస్తున్న‌ సినిమాలు కూడా చాలానే  ఉన్నాయి. అయితే  ఇపుడున్న రాజకీయాలలో చూస్తే  రిపబ్లిక్ సినిమా కొన్ని వర్గాల రాజకీయ నేతలకు ఉత్సాహంగా కూడా ఉంది.

అయితే ఇపుడు మరో పొలిటికల్  సినిమాగా  సన్ ఆఫ్ ఇండియా వస్తోంది. దీనిని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నిర్మించి మరీ నటిస్తున్నారు. మోహన్ బాబు ఈ మధ్య కాలంలో హీరోగా నటించిన సినిమాలు పెద్దగా లేవు. ఆయన కూడా అడపా తడపా సినిమాలు చేస్తున్నారు. అదే టైమ్ లో తన నటనాతృష్ణకు తీర్చుకోవడానికి మంచి పాత్ర వస్తే డేరింగ్ గా నిర్మించి మరీ యాక్ట్ చేస్తున్నారు. ఇపుడు అలాంటిదే  సన్ ఆఫ్ ఇండియా అంటున్నారు. ఈ మధ్యన మోహన్ బాబు కొన్ని మీడియా చానళ్ళకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆ సినిమా గురించి చూచాయగా చెప్పుకొచ్చారు.

అలాగే ఆ సినిమాలో కొన్ని డైలాగులను కూడా ఆయన వల్లె వేశారు. చూడబోతే ఈ మూవీ పక్కా రాజకీయ వాసనలతోనే ఉండబోతోంది అని అర్ధమవుతోంది. మరి ఎవరిని ఈ మూవీలో టార్గెట్ చేశారు అన్నదే చర్చగా ఉంది. మోహన్ బాబు కూడా ఒకపుడు యాక్టివ్ పొలిటీషియన్ గా ఉన్నారు. ఆయన రాజకీయ  ప్రస్థానం తెలుగుదేశంతో మొదలైంది. రాజ్యసభ మెంబర్ గా కూడా పనిచేశారు. ఆ తరువాత బీజేపీ, వైసీపీలకు మద్దతు ఇచ్చారు. ఇక తనకు ఇక మీదట రాజకీయాల్లో ఆసక్తి లేదని కూడా తాజాగా ఆయన  చెప్పుకున్నారు. కానీ ఆయన సన్ ఆఫ్ ఇండియా లో డైనమైట్ల లాంటి డైలాగులు బోలెడు ఉన్నాయని అంటున్నారు. వాటిని ఆయన మాట్లాడే దాంట్లోనే ఒక రకమైన ఇంటరెస్ట్ వస్తోంది. ఈ మూవీని వచ్చే ఏడాది అన్నీ చూసుకుని రిలీజ్ చేస్తారని అంటున్నారు. మోహన్ బాబు ఈ మూవీలో పేల్చే డైలాగులు ఎవరి మీద ఎందుకు అన్నదే ఇపుడు హాట్ హాట్ డిస్కషన్ గా ఉంది. మూవీ రిలీజ్ అయితే తప్ప అసలు గుట్టు ఏంటన్నది తెలియదు మరి.
Tags:    

Similar News