త్రివిక్రమ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ హారికా హాసిని సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ఈ మూవీ మీద అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. నా పేరు సూర్య తర్వాత ఏడాదిన్నర పైగా గ్యాప్ తో సంక్రాంతికి రానున్న బన్నీ సినిమా ఇది. అందుకే తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో సైతం దీని మీద భారీ క్రేజ్ ఉంది. ఇటీవలే కాకినాడ షెడ్యూల్ కోసం అక్కడికి వెళ్లిన వెళ్లిన యూనిట్ అనుకున్న తేదీ 9 కన్నా ముందే రావడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో బన్నీ- త్రివిక్రమ్-థమన్ రిటర్న్ అవుతున్నప్పుడు తీసిన పిక్స్ సోషల్ మీడియాలోకి వచ్చేశాయి. ప్లాన్ చేసుకున్న ప్రకారం కాకినాడలో 9 దాకా షూటింగ్ ప్లాన్ చేశారు. ఆ రోజే రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చేలా ప్రొడక్షన్ టీమ్ మొత్తం సెట్ చేసింది. కానీ అనూహ్యంగా ఒక రోజు ముందే రావడం పట్ల కొన్ని సందేహాలు రాకమానవు
ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. షూటింగ్ చేసుకోవడానికి పరిస్థితులు అంత అనుగుణంగా లేవు. ఇది గుర్తించే త్వరగా సీన్లు పూర్తి చేశారా లేక బాలన్స్ ఉన్నవి హైదరాబాద్ లో షూట్ చేస్తారా అనే క్లారిటీ మీడియాకు లేదు. ఏ కారణం చేతనూ వాయిదా వేసేందుకు ఛాన్స్ లేనంత టైట్ ప్లానింగ్ తో ఈ మూవీ సాగుతోంది. విడుదల సంక్రాంతికి అనౌన్స్ చేశారు కాబట్టి ఆ డేట్ ని మీట్ అవ్వాలి అంటే డిసెంబర్ మూడో వారంలోపు ఫస్ట్ కాపీ రెడీ చేయాలి. అందుకే ఎక్కడా గ్యాప్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు. థమన్ కూడా షూటింగ్ స్పాట్ కూడా వెళ్తున్నాడంటే బాలన్స్ ఉన్న ట్యూన్స్ కూడా అక్కడే కంపోజ్ చేస్తున్నారేమో.