భీమ్లా నాయ‌క్ పై బ‌న్ని సైలెన్స్ మీనింగ్?

Update: 2022-03-01 02:50 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ - ద‌గ్గుబాటి రానా న‌టించిన భీమ్లా నాయ‌క్ పాజిటివ్ స‌మీక్ష‌లు పాజిటివ్ మౌత్ టాక్ తో బాక్సాఫీస్ వ‌ద్ద చక్క‌ని వ‌సూళ్ల‌ను సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. తొలి వీకెండ్ నాటికే ఈ చిత్రం 100 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇక‌పోతే భీమ్లాపై ఇప్పటికే ప‌లువురు స్టార్ హీరోలు ప్ర‌శంస‌లు కురిపిస్తుండ‌గా ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు పాజిటివ్ నోట్ తో చ‌క్క‌ని ప్ర‌చారం చేస్తున్నాయి. కార‌ణం ఏదైనా కామ‌న్ జ‌నాల్లో ఈ సినిమాపై బోలెడంత హైప్ నెల‌కొని ఉంది.  

భీమ్లా నాయక్ ఘాటు.. రివర్టింగ్ .. క‌రెంట్ ప్ర‌వాహం! అంటూ సూప‌ర్ స్టార్ మహేష్ బాబు వంటివారు ట్వీట్ చేయ‌గా అది అభిమానుల్లోకి దూసుకెళ్లింది. నిజానికి ఇతర స్టార్ మెగా హీరోలు సినిమా గురించి మాట్లాడాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే తన శుభాకాంక్షలను తెలియజేయ‌గా.. భీమ్లా పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంత‌వ‌ర‌కూ స్పందించ‌నే లేదు.

భీమ్లా నాయ‌క్ పై అత‌డు సమీక్ష ఇస్తార‌ని ఎదురు చూస్తున్నా అది జ‌ర‌గ‌డం లేదు. చ‌ర‌ణ్ కూడా బాబాయ్ సినిమాని ప్ర‌శంసించారు. కానీ ఇప్పటివరకు అల్లు అర్జున్ సినిమాపై తన అభిప్రాయాలను పంచుకోలేదు. ఆయన సినిమా చూసి తన అభిప్రాయాన్ని తెలియజేయాలని అభిమానులు ఎదురుచూస్తున్నా నిరాశే ఎదుర‌వుతోంది.

అయితే దీనికి ర‌క‌ర‌కాల కార‌ణాల్ని వెతుకుతున్నారు కొంద‌రు విశ్లేష‌కులు.. పుష్ప‌ చిత్ర విడుదల ప్రారంభ దశలో మెగాస్టార్ - పవర్ స్టార్ ఎప్పుడూ ఆ మూవీ గురించి పెద్దగా మాట్లాడనందున స్టైలిష్ స్టార్ భీమ్లా గురించి ఏమీ పోస్ట్ చేయకపోవచ్చని కొందరు అభిమానులు భావిస్తుండ‌డం షాక్ నిస్తోంది. నిజానికి ఇదే కార‌ణ‌మా? అంటే.. ఇక్క‌డ ఆలోచించాల్సిన‌వి విశ్లేషించాల్సిన‌వి చాలా సంగ‌తులే ఉన్నాయి.  

అయితే ఈ తరహా గ‌డ‌బిడ‌లో క‌నిపించేందుకు ఇష్ట‌ప‌డ‌ని బ‌న్ని మాత్రం మెగా సినిమాల గురించి కాస్త ఆలస్యంగా మాట్లాడుతుండడం ఆశ్చర్యకరం. మెగా హీరోలు ఎప్పుడూ మెగా సినిమాల గురించి భజన చేస్తారని ప్రేక్షకుల నుంచి అవాంఛనీయ టాక్ రాకుండా ఉండటానికే ఇదంతా చేస్తున్నారా? అన్న‌ది చూడాలి.

 ఇక బ‌న్ని పుష్ప చిత్రాన్ని చిరు ప‌వ‌న్ లేదా చ‌ర‌ణ్ పొగిడేయ‌క‌పోవ‌డానికి కార‌ణం మెగా హీరోల సొంత భ‌జ‌న ఎవ‌రికీ రుచించ‌ద‌నే ఉద్ధేశ‌మే కావొచ్చు. అల్లు అర్జున్ కి అయినా ఇదే వ‌ర్తిస్తుంది. అందుకే అత‌డు ఆరంభ‌మే భ‌జ‌న చేసేందుకు సిద్ధంగా లేడు. బ‌న్ని ఆలస్యంగా అయినా భీమ్లా నాయ‌క్ పై స్పందిస్తాడు. తాను ఇంకా సినిమా చూడ‌లేద‌ని చెబుతాడు. చూసాక రివ్యూ చెబుతాడ‌న్న‌మాట‌.
Tags:    

Similar News