ఈ జంట ఎందుకు విడిపోయారు?

Update: 2022-07-28 02:30 GMT
సినిమా ఇండస్ట్రీ లో బ్రేకప్స్ అనేది సర్వ సాదారణం గా మారాయి. ముఖ్యంగా బాలీవుడ్‌ లో హీరో లు హీరోయిన్స్ ప్రేమలో పడటం.. కొన్నాళ్ల తర్వాత బ్రేకప్‌ అవ్వడం జరుగుతుంది. తాజాగా బాలీవుడ్ లో కొత్త బ్రేకప్ వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ యంగ్‌ స్టార్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ గత కొన్నాళ్లుగా దిశా పటానీ ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు చూశాం.. వారిద్దరు రిలేషన్ లో ఉన్నట్లుగా అధికారికంగానే చెప్పారు.

ఇద్దరి మధ్య ప్రేమ హద్దులు దాటింది.. ఎల్లలు దాటింది. కుటుంబ సభ్యులు కూడా దాదాపుగా ఓకే అనేశారు. పెళ్లి చేసుకుంటారు అంటూ వార్తలు వచ్చాయి. ఇద్దరు ఎన్నో పార్టీలకు పబ్‌ లకు వెళ్లడం... ఎన్నో కార్యక్రమాలకు వెళ్లడం కనిపించింది. ఇద్దరు కలిసి వరుసగా సినిమా ల్లో కూడా నటించారు. కాని అనూహ్యంగా వీరిద్దరు బ్రేకప్‌ అవ్వడం ఆశ్చర్యంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఆరు సంవత్సరాలుగా రిలేషన్ లో ఉన్న వీరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్న సమయంలో అనూహ్యంగా బ్రేకప్‌ అంటూ వార్తలు రావడం ను వారి అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. బాలీవుడ్‌ వర్గాల్లో కూడా ఈ విషయమై ప్రముఖంగా చర్చ జరుగుతోంది. బాబోయ్‌ ఇలా జరిగిందేంటి అంటూ అంతా కూడా చర్చించుకోవడం మొదలు పెట్టారు.

వీరిద్దరూ ముందు ముందు మంచి స్నేహితులుగా ఉండబోతున్నారు.. కానీ ప్రేమికులుగా లేదా జీవిత భాగస్వామిగా ఉండబోరు అంటూ వారి సన్నిహితులు చెప్పుకొచ్చారు. కానీ వీరిద్దరూ ఎందుకు విడిపోయారు అనే విషయంలో మాత్రం వారు క్లారిటీ ఇవ్వలేదు. హీరో గా టైగర్ ష్రాఫ్ ప్రస్తుతం టాప్‌ లో ఉన్నాడు. హీరోయిన్ గా ఆమె కూడా ఓ రేంజ్ లోనే ఉంది.

బాలీవుడ్‌ లో మోస్ట్‌ బ్యూటీఫుల్‌ లవ్ బర్డ్స్‌ అంటూ వార్తలు వస్తున్న సమయంలో వీరి బ్రేకప్‌ కు కారణం ఏమయ్యి ఉంటుంది.. వీరు విడిపోవడంకు ఎవరు కారణం అయ్యి ఉంటారు అంటూ బాలీవుడ్‌ లో చర్చ జరుగుతోంది.

హీరో గా మరియు హీరోయిన్ గా ఇద్దరు బిజీగా ఉండటం వల్ల ఏమైనా రిలేషన్ లో విభేదాలు వచ్చి ఉంటాయా అంటూ కొందరు ఊహిస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది వారు నోరు తెరిస్తే కానీ క్లారిటీ రాదు.
Tags:    

Similar News