యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆదిపురుష్’.మహాకావ్యం రామాయణం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మొన్న బుధవారం (ఏప్రిల్ 21న) శ్రీరామ నవమి సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందని వార్తలు వచ్చాయి. శ్రీరాముడు పట్టాభిషేకం సన్నివేశం ఫొటో వచ్చి వైరల్ అవుతుందని అందరూ భావించారు. అయితే టీమ్ హ్యాండ్ ఇచ్చింది. లుక్ బయిటకు రాలేదు. ఎందుకు రాలేదు అనేది అంతటా చర్చనీయాంశంగా మారింది. రకరకాల కారణాలు వినపడుతున్నాయి.
అందులో మొదటిది..అసలు టీమ్ శ్రీరామ నవమికి ఏ ఫస్ట్ లుక్ రిలీజ్ చేద్దామని మొదట ప్లాన్ చెయ్యలేదట. రిలీజ్ చాలా కాలం ఉంది కదా ఇప్పటి నుంచి ప్రమోషన్ ఎందుకు అనుకున్నారట. కానీ ఈ వార్త చూసాక ఫస్ట్ లుక్ వదులుదామని అనిపించిందిట. కాని టైమ్ ఎంతో లేదని వదిలేసారట. ఇక రెండో కారణం టీమ్ తయారు చేసిన ఫస్ట్ లుక్ ఫొటో లో శ్రీరామముడుగా ఉన్న ప్రభాస్ ...కండలు తిరిగిన లుక్ తో అచ్చం హాలీవుడ్ రాముడు లా లేడట.
అది చూసిన ప్రభాస్ కుటుంబం,కృష్ణంరాజు ఇలాంటిది బయిటకు వద్దు. రాముడు అంటే మనకు నీల మేఘ శ్యాముడు,రవివర్మ చిత్రంలా ఉండాలి అని చెప్పారట. అయితే ఇందులో నిజమెంతో తెలియదు. ఇక మూడో రీజన్ విషయానికి వస్తే...కరోనా తో కంపెనీ టెక్నీషియన్స్ ఎవరూ అందుబాటులో లేరట. అలాగని బయిటకు ఇస్తే లీక్ అయ్యిపోతుందనే భయం ఉందిట. ఈ క్రమంలో పూర్తిగా ఫస్ట్ లుక్కే వద్దనుకున్నారు. ఇలా మూడు కారణాలు వినపడుతున్నాయి. అయితే వీటిలో ఏదీ నిజం కాకపోవచ్చు. లేదా ఒకటైనా నిజం ఉండచ్చు అంటున్నారు.
ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్.. సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఇక లంకేశ్వర రావణాసుడి పాత్రని సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నారు. 30వేల సంవత్సరాల పూర్వం జరిగిన కథతో రామాయణానికి ఉన్న సంబంధాన్ని ఈ సినిమా ద్వారా చూపించనున్నారట. అయితే ఈ సినిమా షూటింగ్ దాదాపు 30 శాతం పూర్తయిందని చిత్ర టీమ్ ప్రకటించింది. గత సంవత్సరమే సినిమా ప్రధాన పాత్రధారుల ప్రిన్సిపల్ ఫోటోగ్రాఫి పూర్తయినట్లు స్పష్టం చేసింది. ఈ సినిమా కోసం ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్‌లు బాడీ ట్రాన్స్‌ఫార్మ్ కోసం ఎంతో శ్రమిస్తున్నారని, కృతి సనన్‌తో కలిసి పని చేయడం ఎంతో మంచి అనుభూతి అని తెలిపారు.