మూడేళ్ల క్రితం సైలెంట్ గా వచ్చి మోన్ స్టార్ గా బాక్సాఫీస్ ని షేక్ చేసిన చిత్రం `కేజీఎఫ్ చాప్టర్ 1`. కన్నడంలో తెరకెక్కిన ఈ చిత్రం పై ముందు ఎలాంటి అంచనాలు లేవు. యష్ అప్పటికి తెలుగులో తెలిసిన హీరో కాదు. ఇతర భాషల్లోనూ అతనికి అంత గుర్తింపూ లేదు.
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వన్ ఫిల్మ్ వండర్ మాత్రమే. అలాంటి టీమ్ నుంచి కన్నడ చిత్ర సీమని తిరగరాసే చిత్రం వస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ అద్భుతం జరిగింది. `కేజీఎఫ్ చాప్టర్ 1` కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సంచలనం సృష్టించింది.
పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ హాలీవుడ్ యాక్షన్ చిత్రాలని తలపించి ప్రేక్షకులని ఆకట్టుకుంది. అంతే కాకుండా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా వసూళ్ల సునామీని సృష్టించింది.
ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ గా `కేజీఎఫ్ చాప్టర్ 2`ని రిలీజ్ చేయబోతున్నారు. పార్ట్ 1 సంలచన విజయం సాధించడంతో పార్ట్ 2పై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఏప్రిల్ 14న ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ గా ఐదు భాషల్లో విడుదల కాబోతోంది.
ఇప్పటికే మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించారు. టీజర్ విడుదలై ఇప్పటికి ఏడాది కావస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి ఎలాంటి అప్ డేట్ గ్లింప్స్ లాంటివి ఏమీ లేవే . సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ అంటూ జనవరి 7న హీరో యష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ మేకర్స్ ఓ పోస్టర్ ని వదిలారు.
ఇటీవల అంతర్జాతీయ మహిళా దానోత్సవం సందర్భంగా సినిమాలో నటించిన మహిళా పాత్రలకు సంబంధించిన ఓ పోస్టర్ ని విడుదల చేశారు. కంప్లీట్ డల్ గా డార్క్ థీమ్ తో వున్న ఈ పోస్టర్ అభిమానుల్ని, సినీ లవర్స్ ని ఏ మాత్రం ఎట్రాక్ట్ చేయలేకపోయింది.
ఇప్పటికే ఈ మూవీపై డల్ గా వున్న అభిమానుల్ని కంప్లీట్ డార్క్ థీమ్ తో డల్ గా వున్న పోస్టర్ ని విడుదల చేసి వారి ఉత్సాహాన్ని మరింత డల్ చేసేసింది. దీంతో ఫ్యాన్స్ మరీ నీరసించిపోతున్నారట. రిలీజ్ దాదాపు మరో నెల రోజులు వున్న నేపథ్యంలో `కేజీఎఫ్ `మేకర్స్ ఇలా డల్ గా పబ్లిసిటీని చేయడం అభిమానులకు పెద్దగా రుచించడం లేదని చెబుతున్నారు. ఇదిలా వుంటే చిత్ర బృందం ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని మార్చి 27న రిలీజ్ చేస్తామంటూ ప్రకటించింది.
సినిమా రిలీజ్ కి దాదాపు 19 రోజుల ముందు ట్రైలర్ రిలీజ్ కి మేకర్స్ రెడీ అవుతుండటం కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఫ్యాన్స్ ఈ మూవీ నుంచి పవర్ ప్యాక్డ్ పోస్టర్స్ ని కోరుకుంటుంటుంటే మేకర్స్ మాత్రం డల్ థీమ్ తో పోస్టర్స్ వదలడం వారికి ఏమాత్రం నచ్చడం లేదట. పేలవమైన పోస్టర్ లను విడుదల చేయడానిక బదులుగా లిరికల్ వీడియోలని విడుదల చేయొచ్చుకదా అంతే కాకుండా వినూత్నమైన ప్రచార కార్యక్రమాలని రూపొందించొచ్చుకదా? అని ఫ్యాన్స్ వాపోతున్నారట.
RRR తరహాలో క్రేజీ సాంగ్ ని విడుదల చేసి సినిమా ప్రచారాన్ని హోరెత్తించే ప్రయత్నాలు కానీ చేస్తే బాగుంటుందని, పాన్ ఇండియా మూవీకి మరి కొన్ని వారాలే వుండటంతో ఇప్పటికి ప్రచారం వైపు మేకర్స్ ఆలోచించకపోవడం విడ్డూరంగా వుందని, ఇలాగైతే సినిమా అనుకున్న స్థాయిలో రీచ్ కావడం కష్టమని ఫ్యాన్స్ ఫీలవుతున్నారట. మరి కేజీఎఫ్ మేకర్స్ మైండ్ లో ఏముందో.. వారు సినిమా ప్రచారాన్ని ఎలా ప్రారంభించాలనుకుంటున్నారో తెలియాలంటే ట్రైలర్ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.