మహర్షి అక్కడెందుకు ఫెయిలయ్యింది ?

Update: 2019-05-18 05:20 GMT
ప్రస్తుతానికి స్టడీగా ఉన్న మహర్షి రన్ సీడెడ్ లాంటి కొన్ని ఏరియాలలో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టుకోలేకపోతోంది. ఒకపక్క నైజాంలో రికార్డులు పడగొడుతున్నా ఇలా ఇతర ప్రాంతాల్లో వీక్ గా ఉండటం మహేష్ ఫ్యాన్స్ ని అయోమయంలో పడేస్తోంది. దాని సంగతి పక్కన పెడితే ప్రిన్స్ కు పెట్టని కోటగా ఉన్న ఓవర్సీస్ లో మహర్షి ఇంకా 2 మిలియన్ మార్క్ కూడా అందుకోలేదు.

1.5 కొంత స్లోగానే చేరుకున్నప్పటికీ ఆ తర్వాత మాత్రం స్ట్రక్ అయిపోయినట్టు ట్రేడ్ రిపోర్ట్. ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రకారం కనీసం 3 నుంచి 4 మిలియన్ డాలర్ల మధ్యలో వస్తేనే మహర్షిని హిట్ గా పరిగణిస్తారు కనీసం నష్టాలు రాకుండా ఆగినందుకు. కాని రెండో వారంలో అడుగు పెట్టాక అంత మొత్తం రాబట్టడం అంటే ఈజీ కాదు. ఒక్కసారి డ్రాప్ మొదలయ్యాక రికవరీ కావడం అంత ఈజీగా ఉండదు

దీనికి కారణాలు ఏమిటా అని విశ్లేషించే పనిలో మహర్షి టీం బిజీగా ఉంది. రైతుల గురించి ఎంత  సందేశం ఇచ్చినా మిగిలిన విషయాల్లో రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములానే ఫాలో కావడం అక్కడి ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. పైగా శ్రీమంతుడు భరత్ అనే నేను తరహా ట్రీట్మెంట్ ఇందులో రిపీట్ అయినట్టు అనిపించడం కొంతవరకు నెగటివ్ గా మారింది.

పైగా తెలుగు రాష్ట్రాల్లో అగ్రెసివ్ ప్రమోషన్ చేసిన తరహాలో యుఎస్ వెళ్లి సక్సెస్ మీట్లు పెట్టడం చూడమని చెబుతూ నిర్వహించే చర్చా కార్యక్రమాలు ఇవేవి సాధ్యపడవు. ఎంతసేపున్నా టాక్ ద్వారా సినిమా నడవాల్సిందే. మహర్షి ఇక్కడే వీక్ అవుతున్నాడు. కొత్తగా ఏమి లేదన్న పెదవి విరుపు వసూళ్లను తగ్గిస్తోంది. పైగా మ్యూజికల్ గా ట్రీట్ అనిపించే అవకాశం లేకపోవడంతో మహర్షి యుఎస్ లో డేంజర్ రన్ సాగిస్తున్నాడు. ఇప్పుడీ వీకెండ్ అయ్యాక రిస్క్ ఎంత వరకు తగ్గించుకున్నాడు  అనే క్లారిటీ వస్తుంది
Tags:    

Similar News