మీటూ వ‌ల్లే అత‌న్ని మ‌ణిర‌త్నం ప‌క్కన పెట్టాడా?

Update: 2022-09-21 16:30 GMT
కోలీవుడ్ లో వున్న స్టార్ డైరెక్ట‌ర్స్ మ‌ణిర‌త్నం, శంక‌ర్‌. వీరి సినిమాల్లో ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత వైర‌ముత్తు ఒక్క పాటైనా వుండాల్సిందే. ఈ ఇద్ద‌రు దిగ్గ‌జ ద‌ర్శ‌కుల‌కు వైర‌ముత్తు అంటే అంత ఇష్టం. ఆయ‌న ర‌చ‌న‌లు అంటే అంటే అభిమానం.

వీరి దృష్టిలో వైర‌ముత్తు ఓ అద్భుతం. అయితే గ‌త కొంత కాలంగా ఆయ‌న‌పై మీటూ విమర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌యుఖ గాయ‌ని, పాపుల‌ర్ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యి కొన్ని నెల‌లుగా వైర‌ముత్తుపై సంచల‌న ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌స్తోంది.

మీటూ వివాదం ఉవ్వెత్తున ఎగ‌సిన సంద‌ర్భంగా కోలీవుడ్ లో వైర‌ముత్తు పేరు ప్ర‌ధానంగా వినిపించింది. చిన్మ‌యి కార‌ణంగానే వైర‌ముత్తు చుట్టూ మీటూ వివాదం మొద‌లైంది. త‌న పాట‌లు పాడే కొంత మంది గాయ‌నిల‌ని వైర‌ముత్తు లైంగికంగా వేధింపుల‌కు గురిచేశాడంటూ చిన్మ‌యి చేసిన ఆరోప‌ణ‌లు అప్ప‌ట్లో త‌మిళ‌నాట తీవ్ర దుమారాన్ని రేపాయి. అత‌నికి అందించిన అవార్డుల్ని కూడా వెన‌క్కు తీసుకోవాలని, అంతే కాకుండా ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు ఆయ‌న‌ని ప్రోత్స‌హించ‌రాదంటూ చిన్మ‌యి ఆరోప‌ణ‌లు చేసింది.

త‌ను చేసిన సంచ‌ల‌న ఆరోప‌ణ‌ల కార‌ణంగానే ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియిన్ సెల్వ‌న్‌'కు పాట‌లు రాసే అవ‌కాశాన్ని వైర‌ముత్తుకు ఇవ్వ‌లేద‌ని, మీటూ వివాదం వ‌ల్లే అత‌న్ని మ‌ణిర‌త్నం ప‌క్కన పెట్టాడ‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఈ ఆరోప‌ణ‌ల‌పై తాజాగా ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం స్పందించారు. ఈ సంద‌ర్భంగా వైర‌ముత్తు గురించి మాట్లాడిన మ‌ణిర‌త్నం అత‌ని టాలెంట్ పై ప్ర‌శంస‌లు కురిపించాడు.

వైర‌ముత్తు టాలెంట్ విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి సందేహం లేదు. త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి క‌రుణానిధి సైతం గ‌తంలో వైర‌ముత్తు టాలెంట్ ని గుర్తించి అభినందించారు. నేను ఆయ‌న‌తో క‌లిసి ఎన్నో సార్లు ప‌ని చేశాను. ఆయ‌న క‌విత్వాన్ని నా సినిమాల్లో ఉప‌యోగించా.

ఆయ‌నొక అద్భుతం. అయితే వైర‌ముత్తుని మించిన కొత్త టాలెంట్ ఇండ‌స్ట్రీలో వుంది. కొత్త వాళ్ల‌నీ ప్రోత్స‌హించాలి క‌దా' అంటూ మాట మార్చారు మ‌ణిర‌త్నం. ఇది గ‌మ‌నించిన నెటిజ‌న్ లు మీటూ భ‌యం వ‌ల్లే మ‌ణిర‌త్నం .. వైర‌ముత్తుని ప‌క్క‌న పెట్టాడ‌ని కామెంట్ లు చేస్తున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News