యంగ్ ఎన్టీఆర్ గా కొత్త నటుడు.. ఇప్పుడెందుకు?

Update: 2019-02-07 01:30 GMT
ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం 'ఎన్టీఆర్ కథానాయకుడు' విడుదలయిన తర్వాత సినిమాకు వచ్చిన ఫీడ్ బ్యాక్ లో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే.. వయసు ఎక్కువగా ఉన్న ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య చక్కగా సరిపోయారుగానీ యువకుడిగా ఉన్న ఎన్టీఆర్ పాత్రకు ఆయన సూట్ కాలేదని అన్నారు.  ఎన్టీఆర్ యువకుడి దశలో ఉన్న పాత్రను ఎవరైనా యువనటుడితో చేయిస్తే బాగుండేదనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేశారు.

అయితే ఈ ఫీడ్ బ్యాక్ బాలయ్యకు.. క్రిష్ కు చేరినట్టుందేమో గానీ రెండోభాగంలో ఈ అంశాన్ని సరిదిద్దే చర్యలు చేపట్టారని గాసిప్పులు వినిపిస్తున్నాయి. 'ఎన్టీఆర్ మహానాయకుడు' లో యువకుడైన ఎన్టీఆర్ పాత్రకోసం ఓ కొత్త నటుడిని తీసుకున్నారట.  'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమాలో ముఖ్యంగా పొలిటికల్ జర్నీనే ఉన్నప్పటికీ కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉన్నాయట.  ఈ సన్నివేశాలలో ఎన్టీఆర్ కాలేజి రోజుల సీన్.. బసవతారకంతో వివాహం సీన్  ఉంటాయట.  

యువ ఎన్టీఆర్ పాత్ర మొదటి భాగంలోనే దాదాపుగా చూపించారు. అలాంటప్పుడు ఈ రెండు మూడు సీన్స్ కోసం ఇలా కొత్త నటుడిని తీసుకోవడం ఎందుకని కొందరు పెదవి విరుస్తున్నారు.  రెస్పాన్స్ ఎలా ఉందనే విషయం పక్కనబెడితే  మొదటి భాగంలో యువ ఎన్టీఆర్ పాత్రను బాలయ్య చేశారు కాబట్టి ఇప్పుడుకొత్త నటుడు ఆ పాత్రను చేస్తే కంటిన్యూటి కూడా మిస్ అయ్యే ప్రమాదం ఉందని ఇండస్ట్రీ ఇన్సైడర్స్ అంటున్నారు.  మరి క్రిష్ అండ్ టీమ్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో?
 
మొదటిభాగం సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కమర్షియల్ గా ఫెయిల్యూర్ గా నిలిచింది. దీంతో రెండో భాగాన్ని ఎలాగైనా విజయవంతం చేయాలని క్రిష్ టీమ్ పట్టుదలగా ఉందట. ఇదిలా ఉంటే 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమా విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.  త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటన వస్తుందని అంటున్నారు.
Tags:    

Similar News