చిత్రలహరి మరీ ఆహా ఓహో అని చెప్పుకునేంత గ్రాండ్ సక్సెస్ కాదు కాని సుప్రీమ్ హీరో సాయి తేజ్ గత ఆరు సినిమాల ఫలితాలతో పోలిస్తే చాలా బెటర్ అనే మాట అటు ప్రేక్షకుల నుంచి ఇటు అభిమానుల నుంచి వినిపించింది. దాని వల్లే రీజనబుల్ బిజినెస్ చేసుకున్న ఈ సినిమా ఫైనల్ గా సేఫ్ ప్రాజెక్ట్ గా నిలిచింది. ఇదిలా ఉండగా చిత్రలహరి వచ్చేసి రెండు నెలలు దాటింది. ఇంకా ఈ హీరో కొత్త మూవీ మొదలుకానే లేదు.
మారుతీ దర్శకత్వంలో ప్రతి రోజు పండగే టైటిల్ తో మొత్తం ఫుల్ స్క్రిప్ట్ రెడీ ఉందని ఓ రెండు వారాల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. కాని ఇప్పటికీ షూటింగ్ ప్రారంభించనే లేదు. దీనికి సంబంధించిన కారణం వేరే ఉందట. అదే హీరొయిన్ ఎంపిక. వరస డిజాస్టర్లు వచ్చాక సాయి తేజ్ కు జోడిని సెట్ చేయడం దర్శక నిర్మాతలకు కష్టంగా మారింది. అందుకే చిత్రలహరిలో సైతం ఒక్క సినిమా అనుభవం ఉన్న కళ్యాణి ప్రియదర్శన్ నివేత పెతురాజ్ లను తీసుకున్నారు. అఫ్ కోర్స్ బడ్జెట్ పరంగా కూడా ఈ అంశం కలిసి వచ్చింది.
ఇప్పుడీ ప్రతిరోజు పండగేకు ముందు ఎబిసిడి ఫేం రుక్సర్ ధిల్లాన్ అనుకున్నారు. కాని ఏ ఇమేజ్ లేని బ్యూటీ అయితే మాస్ కి కనెక్ట్ అవ్వడం కష్టం కాబట్టి బెటర్ ఆప్షన్ గా రాశి ఖన్నా వైపు లుక్ వేస్తున్నట్టు సమాచారం. కాని తన డిమాండ్ చూస్తే 70 లక్షల రెమ్యునరేషన్ దాకా ఉంది. అందులో సగం కన్నా తక్కువకే రుక్సర్ లాంటి వాళ్ళు వచ్చేస్తారు. కాని కాంబినేషన్ పరంగా క్రేజ్ రాదు. పైగా తొలిప్రేమ నుంచి రాశి ఖన్నా మేకోవర్ బాగా వర్క్ అవుట్ అయ్యింది. ఎలాగూ ఇంతకు ముందు సుప్రీమ్ లో సాయి తేజ్ పక్కన చేసింది కాబట్టి హిట్ సెంటిమెంట్ కూడా కలిసి వస్తుంది. అధికారిక ప్రకటన వస్తే కాని ఏదీ చెప్పలేం