రేపు ప్రపంచవ్యాప్తంగా సల్మాన్ ఖాన్ భరత్ భారీ ఎత్తున విడుదల కానుంది. ఇప్పటికే ఆన్ లైన్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా ఉన్నాయి. రంజాన్ పండగా సందర్భంగా ప్రతి ఏడాది తన కొత్త సినిమా ఉండేలా ప్లాన్ చేసుకునే సల్మాన్ కు గత రెండు ఈద్ లు చేదు అనుభవాన్ని ఇచ్చాయి. ట్యూబ్ లైట్ తర్వాత రేస్ 3 దారుణమైన డిజాస్టర్లుగా మిగిలాయి. ఈ భరత్ ఆ నెగటివ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుందనే నమ్మకంతో ఉన్నాడు సల్లు భాయ్.
నిజానికి భరత్ ని సౌత్ లాంగ్వేజెస్ లో డబ్బింగ్ చేయాలనుకున్నారు. ఇందుకోసం రామ్ చరణ్ తో గాత్రం ఇప్పించేందుకు అంగీకారం అయిపోయిందని టాక్ వచ్చింది. గతంలో ప్రేమ్ రతన్ ధన్ పాయోకు సల్మాన్ ఖాన్ పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పింది రామ్ చరణే. ఆ చనువుతో స్నేహంతో సల్మాన్ అడగ్గానే చెర్రీ ఓకే చెప్పినట్టు అప్పుడే న్యూస్ వచ్చింది
తీరా ఇప్పుడు చూస్తే ఫైనల్ గా ఎందుకో అంత సాహసం చేయలేకపోయారు. చివరికి హిందీ వెర్షన్ మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. కారణాలు పరిశీలిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో సల్మాన్ ఖాన్ సినిమాలు తెలుగు వెర్షన్లు ఆడటం కష్టమే. ఆ ట్రెండ్ కూడా ఇప్పుడు లేదు. అనవసరమైన వ్యయ ప్రయాసలు తప్ప వసూళ్ల పరంగా భారీ ఫలితాలు వచ్చే ఛాన్స్ లేదు.
అందుకే రిస్క్ ఎందుకు లెమ్మని సైలెంట్ గా ఒరిజినల్ వెర్షనే విడుదల చేస్తున్నారు కాబోలు. కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు. ఓ యువకుడి జీవితాన్ని 25 నుంచి 60 ఏళ్ళకు దేశభక్తిని ముడిపెట్టి చూపడమే భరత్. దీని మీద అభిమానుల అంచనాలు అయితే మాములుగా లేవు. హైదరాబాద్ లో భారీ సంఖ్యలో స్క్రీన్లు కేటాయిస్తున్నారు భరత్ కోసం.