సైరా - ఇలా జరిగిందేమిటి?

Update: 2018-08-23 05:18 GMT
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా కొణిదెల సంస్థ విడుదల చేసిన సైరా నరసింహారెడ్డి టీజర్ సంచలనాలకు వేదికగా మారిన సంగతి తెలిసిందే. సంస్థ ఇచ్చిన అధికారిక ప్రకటన మేరకు ఇప్పటికే 12 మిలియన్ల  డిజిటల్ వ్యూస్ దాటేసిన సైరా ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంది. మొదటిరోజే 9 మిలియన్లు దాటేసిన ఏ టీజరైనా సరే  సాధారణంగా ఇండియాకు సంబంధించి ట్రెండింగ్ లో ఉండటం సాధారణం. కానీ విచిత్రంగా సైరా టీజర్ టాప్ లిస్ట్ లో లేకపోవడం మెగా ఫాన్స్ ని సైతం విస్మయపరిచింది. దీనికి కారణాలు ఇంకా తెలియలేదు కానీ సాంకేతికంగా జరిగే పొరపాట్లు ఇలాంటి వాటికి దారి తీస్తాయి. టీజర్ విడుదలైన ఐదారు గంటల వరకు వ్యూస్ తో మోతెక్కిపోయిన సైరా ఆ సమయంలో హెడ్డింగ్ కింద ఎరుపు రంగులో ఉండాల్సిన ట్రెండింగ్ ట్యాగ్  కూడా లేకపోవడం కొత్త అనుమానాలు రేపింది. ఎవరు చూడకపోతే అన్నేసి మిలియన్ల వ్యూస్ ఎలా వస్తాయి అనే మెగా ఫ్యాన్స్ ప్రశ్న సహేతుకమైందే.

మరి ఎక్కడ పొరపాటు జరిగిందో లేక నిజంగానే సైరా గురించి ట్రెండింగ్ జరగలేదో తెలియదు కానీ  ఈ అంశం సోషల్ మీడియాలో కొంత వరకు ట్రాలింగ్ కు గురి కావడం మెగా ఫాన్స్ ని ఇబ్బంది పెట్టింది. ఇన్ని ప్రశంశలు సపోర్ట్ దక్కిన తర్వాత కూడా ఆ టీజర్ ట్రెండ్ లో లేకపోవడం వెనుక కారణాలు విశ్లేషించాలని చిరు అభిమానులు కోరుతున్నారు. నిర్మాత రామ్ చరణ్ కు ఇదేమంత సీరియస్ మ్యాటర్ అనిపించకపోవచ్చు కానీ డిజిటల్ ప్రపంచంలో ఫ్యాన్స్ వ్యూస్ ని సైతం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఎన్ని లక్షలు ఎన్ని  కోట్లు వ్యూస్ వచ్చాయి అనే దాన్ని బట్టి ప్రచారం చేసుకోవడం ఈ మధ్య కాలంలో సౌత్ లో మరీ ఎక్కువైంది. ఫస్ట్ లుక్ పోస్టర్స్ కే లెక్కేలేసుకుంటున్న తరుణంలో చిరంజీవి టీజర్ కు ఇలా జరిగింది అంటే ఊరుకుంటారా. అందుకే ఇది ఇంత చర్చకు దారి తీసింది.
Tags:    

Similar News