ఎన్టీఆర్ సెగలు ఎవరికీ తగలడం లేదా

Update: 2019-03-08 06:44 GMT
ఇందాకా విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ 2 మెల్లగా ప్రకంపనలు రేపుతోంది. ఎప్పటిలాగే వర్మ ఏదో హడావిడి చేసి తుస్సుమనిపిస్తాడు ఫస్ట్ ట్రైలర్ లో ఉన్నదే ఇందులో కూడా రిపీట్ అవుతుందన్న అంచనాలకు భిన్నంగా ఇది రావడంతో అందరూ షాక్ తిన్నారు. ఈసారి వర్మ ఫుల్ క్లారిటీతో ఇందులో చంద్రబాబు నాయుడు పాత్రను ఎలా ప్రాజెక్ట్ చేశాడో క్లియర్ కట్ గా చూపించాడు. ఎన్టీఆర్ నుంచి లక్ష్మి పార్వతిని దూరం చేయడానికి ఏం చేయడానికైనా సిద్ధమే అనే రీతిలో చిత్రీకరించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

అంతే కాదు లోకేష్ మీద ఒట్టు అని  బాబు ద్వారా చెప్పి వర్మ ఇందులో అందరిని ఫుల్ గా వాడుకున్నట్టు చెప్పకుండా చూపించేశాడు. కోడెల-హరికృష్ణ- దగ్గుబాటి ఒకరేమిటి రెండు ట్రైలర్లు మిక్స్ చేసి చూస్తే అందరూ దర్శనమిస్తారు. అయితే తమ నాయకుడిని ఇంత పచ్చిగా చూపిస్తున్న వర్మ మీద టిడిపి వర్గాలు నాయకులు సైలెంట్ గా ఉన్నాయి. ప్రతివ్యూహంగా తెరవెనుక ఏదో జరుగుతోందని లీక్స్ వస్తున్నాయి కానీ అది కోర్ట్ కేసు రూపంలోనా లేక ఎన్నికల సంఘం నుంచి అభ్యంతరం తెచ్చుకోవడం గురించా ఇంకా క్లారిటీ లేదు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి ఎవరూ నోరు పారేసుకోవడం కానీ కామెంట్లు విసరడం లాంటివి చేయకూడదని టిడిపి టాప్ క్యాడర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయట. అందుకే వర్మ ఇంత రచ్చ చేసి బాబుని విలన్ ని చేసినా టిడిపి మౌన వ్రతాన్నే ఆశ్రయిస్తోంది. పైకి మాత్రం ఏమి జరగనట్టు కనిపిస్తున్నా ఎక్కడో కాలుతున్న మాట మాత్రం వాస్తవం. రెండు గంటల లోపే 2 లక్షల వ్యూస్ కు దగ్గరలో ఉన్న ట్రైలర్ 2 కొత్త సంచలనాలకు తెరలేపడం ఖాయంగా కనిపిస్తోంది
    

Tags:    

Similar News