టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇటీవల కాలంలో పెద్దగా సందడి కనిపించడం లేదు. వారం వారం సరికొత్త చిత్రాలు థియేటర్లలోకి వస్తున్నాయి కానీ.. ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం దక్కడం లేదు. కొన్ని సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. సరైన ప్లానింగ్ తో రిలీజ్ చేయకపోవడంతో వసూళ్లు రాబట్టలేకపోతున్నాయి.
ఎంత మంచి సినిమాకైనా ఈరోజుల్లో జనాలను థియేటర్లకు రప్పించడం ఫిలిం మేకర్స్ కు పెద్ద సవాలుగా మారిపోయింది. పాండమిక్ తర్వాత సెలెక్టివ్ గా సినిమాలు చూస్తున్న ప్రేక్షకులు.. టీజర్ - ట్రైలర్ వంటి ప్రమోషనల్ కంటెంట్ తో ఆకర్షించిన చిత్రాలను మాత్రమే చూస్తున్నారు.
అందుకే అందరూ ఇప్పుడు ప్రమోషన్స్ మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. స్పెషల్ ఈవెంట్స్, కాలేజీ టూర్లు చేయడమే కాదు.. పాదయాత్ర వంటి వినూత్నమైన ప్రమోషనల్ స్ట్రాటజీలతో ముందుకు వస్తున్నారు. అయితే ఇంత చేసినా కూడా సరైన టైంలో రిలీజ్ చేయకపోతే మాత్రం ఆశించిన రిజల్ట్ దక్కే పరిస్థితి లేదు.
ఇటీవల దసరా సందర్భంగా రిలీజైన 'స్వాతిముత్యం' సినిమాను ఉదాహరణగా తీసుకుంటే.. స్పెషల్ ప్రీమియర్స్ కే మంచి టాక్ వచ్చింది. రివ్యూలు కూడా సానుకూలంగా వచ్చాయి. కానీ ఫలితం మాత్రం వేరేలా వచ్చింది. దీనికి కారణం సరైన ప్లానింగ్ లేకుండా విడుదల చేయడమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
'గాడ్ ఫాదర్' 'ది ఘోస్ట్' వంటి పెద్ద హీరోలు నటించిన సినిమాలు బరిలో ఉన్నప్పుడు.. అందరి ఫోకస్ వాటిపైనే ఉండటం సహజం. కానీ ఫెస్టివల్ సీజన్ ని క్యాష్ చేసుకోవాలనుకొని అలాంటి టైంలో 'స్వాతిముత్యం' చిత్రాన్ని రిలీజ్ చేయడం వల్ల ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదని అర్థమవుతోంది.
ఇప్పుడు ఓటీటీలో 'స్వాతిముత్యం' సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. అదే విజయ దశమికి వారం ముందుగానో వారం తర్వాతో విడుదల చేస్తే ఫలితం మరోలా ఉండేదనే కామెంట్స్ వస్తున్నాయి. నిజానికి తదుపరి వీక్ లో సినిమాలేవీ లేవు. ఇది కన్నడ డబ్బింగ్ సినిమా 'కాంతారా' క్యాష్ చేసుకుంది.
అలానే దీపావళికి ఐదు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అయితే ఒక్కసారిగా అన్ని చిత్రాలు రావడం వసూళ్లపై దెబ్బ పడింది. అదే ఒకటీ రెండు సినిమాలను ఈ వారం రిలీజ్ చేసుంటే.. కలెక్షన్స్ కాస్త బెటర్ గా ఉండేవి. చెప్పుకోదగ్గ సినిమా ఏదీ రిలీజ్ కావలేదు కాబట్టి.. ఆ చిత్రాలకు కలిసొచ్చేది.
వచ్చే వారం నవంబరు 4వ 'ఊర్వశివో రాక్షశివో' 'లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్' 'బొమ్మ బ్లాక్ బస్టర్' 'బనారస్' 'ఆకాశం' లాంటి ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. డిసెంబర్ 2న 'సార్' 'హిట్ 2' సినిమాలు షెడ్యూల్ చేయబడగా.. ఇప్పుడు కొత్తగా కళ్యాణ్ రామ్ మూవీ కూడా వచ్చి చేరుతోంది.
ఇక పెద్ద సినిమాల విషయానికొస్తే.. గతేడాది లాభాలు తెచ్చిపెట్టిన క్రిస్మస్ సీజన్ ని వదిలేసి.. ఈసారి సంక్రాంతి కోసం ఫైట్ చేస్తున్నారు. 'ఆది పురుష్' 'వారసుడు' 'వాల్తేరు వీరయ్య' సినిమాలు పండక్కి వస్తున్నాయి. డిసెంబర్ లో రిలీజ్ అవుతాయనుకున్న 'ఏజెంట్' 'వీర సింహా రెడ్డి' సినిమాలు కూడా పొంగల్ బరిలో దిగుతున్నాయి. ఇవి చాలవన్నట్లు అజిత్ కుమార్ నటించే తమిళ్ డబ్బింగ్ మూవీ కూడా రావాలని చూస్తోంది.
ఇలా స్టార్ హీరోలు, మీడియం రేంజ్ చిత్రాలు ఒకే వారంలో పోటీ పడటం వల్ల ఓపెనింగ్స్ తగ్గిపోతాయి. మంచి కంటెంట్ తో వచ్చిన సినిమాలైనా జనాలకు రీచ్ అవకాశం లేకుండా పోతుంది. ఫలితంగా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి టాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదో అర్థం కావడం లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.