టాలీవుడ్ లో దశాబ్ధాల పాటు సినిమాలు తీస్తున్న అగ్ర బ్యానర్ల ప్రస్తుతం సీనేంటి? ఎవరు ఎలాంటి సన్నివేశంలో ఉన్నారు? ఎవరి ఫార్ములా ఏంటి? సక్సెస్ - ఫెయిల్యూర్ వెనక అసలు కథేంటో పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికర సంగతులు తెలుస్తాయి. కొన్ని విస్మయం కలిగించే నిజాలు బయటపడతాయి.
మాస్టర్ మైండ్ డి.సురేష్ బాబు సారథ్యంలోని సురేష్ ప్రొడక్షన్స్, నైజాం కింగ్ దిల్ రాజు సారథ్యంలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, అల్లు అరవింద్ సారథ్యంలోని గీతా ఆర్ట్స్, నాగార్జున - అన్నపూర్ణ స్టూడియోస్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలు పరిశ్రమలో దశాబ్ధాల పాటు మనుగడ సాగించి విజయవంతంగా ముందుకు సాగుతున్నాయి. అయితే ఇటీవల కొన్ని అగ్ర బ్యానర్లు సినిమాలు తీయడం తగ్గించిన మాట వాస్తవం. సురేష్ ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లలో ఒకదాని వెంట ఒకటిగా సినిమాలు రావడం లేదు. అప్పుడప్పుడు మేం కూడా ఉన్నాం అన్నట్టుగానే ఉంది వ్యాపకం! అన్న విమర్శలు ఉన్నాయి. ఇతరులతో పోలిస్తే వీళ్లలో అగ్ర నిర్మాత దిల్ రాజు మాత్రం పెద్ద సినిమాలు తీస్తూనే చిన్న సినిమాలకు ఊతం ఇస్తున్నారు.
ఇకపోతే బాస్ అల్లు అరవింద్ తన శిష్యులతో కలిసి జీఏ2 బ్యానర్ ని యాక్టివేషన్ లో ఉంచి అందులో ఓ ఫార్ములా ప్రకారం సినిమాలు తీస్తూ సక్సెస్ ని అందిస్తున్నారు. గీతా ఆర్ట్స్ లో బన్నితో తప్ప సినిమాలు తీయలేదు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కి మాత్రమే అవకాశం కనిపిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ లో బయటి హీరోల కంటే సొంత హీరోల సినిమాలే తెరకెక్కుతాయన్న సంగతి తెలిసిందే. వెంకీ, రానాలతోనే సినిమాలు తీస్తున్నారు. రవిబాబు లాంటి వాళ్లను నమ్మి కొన్ని సినిమాలు తీసినా ఇటీవల ఫ్లాపులు ఎదురవుతుండడంతో అదీ తగ్గించేశారు. అలాగే అక్కినేని నాగార్జున సారథ్యంలోని అన్న పూర్ణ స్టూడియోస్ లోనూ సొంత హీరోలతోనే సినిమాలు తీస్తున్నారు. నాగార్జున, నాగచైతన్య, అఖిల్, సుశాంత్, సుమంత్ లతో ఈ బ్యానర్ యాక్టివ్ గా ఉంది. ఇకపోతే ఇదివరకూ మంచు కాంపౌండ్ లో రెండు బ్యానర్లు యాక్టివ్ గా ఉండి సినిమాలు నిర్మించేవి.
కానీ ఇటీవల విష్ణు, మనోజ్, లక్ష్మీ ప్రసన్న యాక్టివ్ గా సినిమాలు చేయకపోవడంతో ఆ బ్యానర్లు ప్రస్తుతం సైలెంట్ గానే ఉన్నాయి. ఇక గత నాలుగైదేళ్లలో అగ్ర నిర్మాణ సంస్థలుగా పేరు తెచ్చుకున్న యువి క్రియేషన్స్, మైత్రి మూవీ క్రియేషన్స్ రెగ్యులర్ గా సినిమాలు చేస్తూ యాక్టివ్ గా ఉన్నాయి. మంచి కాంబినేషన్స్ ను కుదుర్చుకుని సినిమాలు తీస్తున్నాయి. చిన్నా, పెద్ద సినిమాల్ని ఈ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇక అగ్ర హీరో రామ్ చరణ్ స్వయంగా కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీని స్థాపించి మెగాస్టార్ చిరంజీవితో మాత్రమే సినిమాలు తీయడం చర్చకొచ్చింది. ఒకప్పుడు యాక్టివ్ గా ఎన్నో సినిమాలు తీసిన స్రవంతి మూవీస్ ఇటీవల దాదాపు సైలెంట్ గా ఉంది. కుమారుడు రామ్ కెరీర్ అంతంత మాత్రంగానే ఉండడంతో పెదనాన్న స్రవంతి రవికిషోర్ సినిమాలు తగ్గించారు. మరోవైపు బ్లాక్ బస్టర్లతో సంచలనాలు సృష్టించిన పూరి జగన్నాథ్ సొంత బ్యానర్ లో సినిమాలు తీస్తున్నారు. కానీ సీనేంటో అందరికీ తెలిసిందే. దీంతో అతడు నెమ్మదిగానే అడుగులు వేయాల్సి వస్తోంది. ఇదంతా.. యాక్టివ్ గా సినిమాలు తీసే బ్యానర్ల గురించి సమాచారం. పరిశ్రమలో ఇంకా ఎన్నో అగ్ర బ్యానర్లు ఉన్నాయి. కానీ చాలా బ్యానర్లు మారిన ట్రెండ్ లో మనుగడ సాగించలేక చతికిలబడినవే. అందువల్ల వాటిని ప్రస్థావించడం లేదు ఎవరూ.
మెజారిటీ పార్ట్ అగ్ర బ్యానర్లు అగ్ర హీరో - పెద్ద డైరెక్టర్ కాంబినేషన్ సెట్ చేసి.. భారీ కాస్టింగ్ తో భారీ బడ్జెట్లను కుమ్మరించి... సినిమా రిలీజ్ ముందే బిజినెస్ పూర్తి చేసుకుని సేఫ్ గేమ్ ఆడేందుకే ఇష్టపడుతున్నాయి. అయితే ఈ గేమ్ బొమ్మా - బొరుసు ఆట లాంటిది. అయితే హిట్టు, లేకపోతే ఫట్టు.. హిట్టొస్తే భారీ లాభాలొస్తున్నాయి. ఫ్లాపొచ్చినా అంతే భారీగా నష్టాలు తప్పడం లేదు. ఈ సన్నివేశం నుంచి బయటపడేందుకు కొందరు తెలివైన న్యూ గేమ్ ప్లాన్స్ ని సిద్ధం చేసుకుని చిన్నా పెద్ద సినిమాల కలయికగా ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారు.