భీమ్లా ఈవెంట్లో మాయావి సైలెన్స్ దేనికి?

Update: 2022-02-24 03:59 GMT
మైక్ ప‌ట్టుకుంటే కొంద‌రు మైకాసురులు ఉన్నారు. ఆ బాప‌తు కాదు కానీ పంచీగా నాలుగైదు లైన్లు అయినా చెబుతార‌ని అనుకుంటే మాయావి త్రివిక్ర‌మ్ అలా నిరాశ‌ప‌రిచారేమీ?  .. ఆయ‌న చిల‌క‌ప‌లుకులు వినే భాగ్యం ప‌వ‌న్ - రానా ఫ్యాన్స్ కి ద‌క్క‌లేదు నిన్న‌టి రేయి భీమ్లా ఈవెంట్లో.

వేదిక‌పై క‌నిపించారు. వేదిక వెన‌క‌ సంద‌డి చేశారు త‌ప్ప త్రివిక్ర‌మ్ ఏదీ మాట్లాడ‌లేదు. ఆయ‌న మౌనమునిలా క‌నిపించారు దేనికో!  దీంతో అభిమానులు ర‌క‌ర‌కాల సందేహాల్ని వ్య‌క్తం చేస్తున్నారు. త్రివిక్రమ్ `భీమ్లానాయక్` ఈవెంట్ లో ఎందుకు మాట్లాడలేదు? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.  ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైలాగ్ రైటర్ .. టోటల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గా `భీమ్లా నాయక్` వెనుక ఉన్న వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్ పెద్దగా కనిపించలేదు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాల్సిందిగా కేటీఆర్ ను ఆయనే స్వయంగా ఆహ్వానించార‌ని స‌మాచారం. అయితే కెటిఆర్ హాజరయ్యారు కానీ త్రివిక్రమ్ తో పెద్ద‌గా కనిపించలేదు.

వేడుక ఆద్యంతం త్రివిక్ర‌మ్ సైలెన్స్ వెన‌క అస‌లు కార‌ణం వేరే ఉందన్న గుస‌గుస వినిపిస్తోంది. బండ్ల గ‌ణేష్ తో వివాదం కార‌ణంగానే అత‌డు ఇలా సైలెంట్ గా మౌన‌మునిలా ఉండిపోయార‌న్న గుస‌గుస వేదిక వ‌ద్ద వినిపించింది. నిజానికి త్రివిక్ర‌మ్ మాట్లాడి ఉంటే బండ్ల‌న్నా బండ్ల‌న్నా!  అనే అరుపులు వినిపించేవ‌ని కొంద‌రు సందేహించారు.

ప‌వ‌న్ తో బండ్ల వాయిస్ రికార్డ్ మ‌హిమ అది!!  ప‌వ‌న్ అభిమానులు హంగామా చేస్తార‌ని బండ్ల‌ను త్రివిక్ర‌మ్ ని రెచ్చ‌గొడ‌తార‌ని కూడా గుస‌గుస‌గా మాట్లాడుకున్నారు. అస‌లు బండ్ల‌తో త్రివిక్ర‌మ్ వివాదం దేనికీ? అంటే.. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా భూముల‌కు సంబంధించిన త‌గాదాలు ఉన్నాయ‌న్న‌ది కొంద‌రికి తెలిసిన నిజం.

ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో యాంక‌ర్ సుమ కూడా త్రివిక్ర‌మ్ మాట్లాడాల‌ని ఒత్తిడి చేయ‌లేదు. అంటే ముందుగానే త్రివిక్ర‌మ్ త‌న చెవిన అస‌లు మాట ప‌డేశార‌న్న గుస‌గుసా వినిపిస్తోంది.  వేదిక వ‌ద్ద అన్ వాంటెడ్ గా ఏదీ జ‌ర‌గ‌కూడ‌ద‌ని అలా ప్లాన్ చేశార‌న్న‌మాట‌. భీమ్లా నాయ‌క్ ఈనెల 25న అత్యంత భారీగా తెలుగు -హిందీ భాష‌ల్లో విడుద‌ల‌వుతోంది.


Tags:    

Similar News