ఆఖరి నిమిషంలో ఓటు వేసిన అనసూయ!

Update: 2021-10-10 10:30 GMT
హోరా హోరీగా సాగిన 'మా' ఎన్నికలు ముగిశాయి. మధ్యాహ్నం 2 గంటల వరకే పోలింగ్ ముగియాల్సి ఉండగా.. క్యూలో, ట్రాఫిక్ లో కొందరు చిక్కుకుపోవడంతో అదనంగా గంట పాటు పోలింగ్ ను పెంచారు.

ఇక మా ఎన్నికల వేళ ఉదయం 8 గంటల నుంచి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రీల్ లైఫ్ లో యాక్టింగ్ చేసే సినీ ప్రముఖులు మా ఎన్నికల సందర్భంగా చేసిన హడావుడి అంతా ఇంతాకాదు.. ఈ సందర్భంగా గొడవలు, వాగ్వాదాలు, కొరుక్కోవడాలు కూడా మా ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రంలో చోటుచేసుకున్నాయి.

ఆదివారం ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు మా పోలింగ్ కొనసాగుతుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఫలితాలను కూడా ఇదే రోజు రాత్రి ప్రకటిస్తారు. రాత్రి 8 గంటలలోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

మా ఎన్నికల్లో తొట్టతొలిగా పవన్ ఓటేశాడు. ఆ తర్వాత వరుసగా చిరంజీవి, రాంచరణ్, బాలక్రిష్ణ, నరేశ్, సాయికుమార్, శివాజీరాజా, సుడిగాలి సుధీర్ సహా సినీ ప్రముఖులు అంతా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇక 'మా' ఎన్నికల్లో స్టార్ హీరోలు కొందరు ఓటు వేయడానికి రాలేదు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, వెంకటేశ్, నాగచైతన్య, నితిన్,  రానా, పూజాహెగ్డే, రకుల్, త్రిష, హన్సిక లు రాలేదు. వీళ్లు ఇంత రచ్చ జరుగుతున్న ఎన్నికలను పట్టించుకోకుండా ఓటు వేసేందుకు రాకపోవడం విశేషం.

సుమారు 925 సభ్యులు 'మా'లో ఉండగా.. 883మందికి ఓటు హక్కు ఉంది. ఇప్పటివరకూ 626మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఉన్న అనసూయ ఉదయం నుంచి ఓటు వేయడానికి ముందుకు రాకపోవడం చర్చనీయాంశమైంది. పోటీ ఉండి ఓటేయకపోవడమేంటి అని దానిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. మంచు ఫ్యామిలీకి బాగా దగ్గరగా ఉండే అనసూయ ఆ కుటుంబంతో వారికి వ్యతిరేకంగా పోటీకి దిగడం ఇష్టం లేకనే ఇలా ఓటేయడానికి రాలేదనే వార్తలు గుప్పుమన్నాయి.

మధ్నాహ్నం 3 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరిగింది. దీంతో అనసూయకు ప్రకాష్ రాజ్ వర్గం వారు ఫోన్ చేసి అనసూయను ఓటు వేయడానికి రావాలని కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే యాంకర్ అనసూయ చివరి నిమిషంలో తన ఓటు వేసినట్టు తెలిసింది.
Tags:    

Similar News