హిమాలయాల్లో నాగ్ 'వైల్డ్ డాగ్'...!

Update: 2020-10-23 16:35 GMT
'కింగ్' అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''వైల్డ్‌ డాగ్''. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా నటిస్తున్నారు. వాస్తవ సంఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న ఈ సినిమాకు అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. దియా మీర్జా - సయామి ఖేర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ జరుగునున్న ఈ చిత్రాన్ని కోవిడ్ నేపథ్యంలో ఇటీవలే తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో ''వైల్డ్‌ డాగ్'' షూటింగ్ ప్రస్తుతం హిమాలయాల పర్వతాల్లో జరుగుతున్నట్లు నాగార్జున వెల్లడించారు. తాజాగా రోహతంగ్ పాస్ లో తీసిన ఓ వీడియోను కింగ్ నాగ్ ట్విటర్‌ లో షేర్ చేశారు.

'సముద్ర మట్టానికి 3980 మీటర్ల ఎత్తులో అంటే 13000 ఫీట్స్ ఎత్తులో తాము ఉన్నామని.. ఇది చాలా డేంజరస్ ప్రాంతమని.. నవంబర్ నుంచి మే వరకు ఈ ప్రదేశాన్ని మూసేస్తారని.. వైల్డ్‌ డాగ్ షూటింగ్ కోసం ఇక్కడకి వచ్చామ'ని నాగార్జున ఈ వీడియోలో తెలిపారు. ''ఈ అందమైన పర్వతాలు - వాటర్ ఫాల్స్ - బ్లూ స్కై మధ్య వైల్డ్ డాగ్ షూటింగ్ చాలా చాలా బాగా జరుగుతోంది. ఏడు నెలల తర్వాత ఇలాంటి అద్భుతమైన ప్లేస్‌ కు రావడం చాలా ఆనందంగా ఉంది. షూటింగ్ 21 రోజుల్లో పూర్తి చేసుకుని తిరిగి వచ్చేస్తాను. లవ్ యూ ఆల్. అప్పటి వరకు టేక్ కేర్'' అని నాగార్జున చెప్పుకొచ్చారు.
Full ViewFull ViewFull ViewFull View
Tags:    

Similar News